Pallavi Prashanth: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మెడకు ఉచ్చు బిగుసుకుంది. గెలిచాడనే సంతోషం లేకుండా చేశారు ఫ్యాన్స్. ఫినాలే రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉన్న కంటెస్టెంట్ల కార్లపై, ప్రభుత్వ ఆస్తులపై దాడి జరిగింది. అయితే ఆ గొడవ చిలికి చిలికి గాలి వాన అయింది. దీంతో ప్రశాంత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు .. నిన్న అతని ఇంటికి వెళ్లి ప్రశాంత్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్ తో పాటు అతని తమ్ముడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
నా తప్పు ఏమిలేదని ప్రశాంత్ అంటున్నాడు. కానీ ఈ గొడవకు అతని నిర్లక్ష్యమే కారణం అని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ప్రశాంత్ ను అక్కడ ఆగకుండా వెంటనే వెళ్లిపొమ్మన్నారు పోలీసులు. కానీ .. ఒక రైతు బిడ్డకు విలువ ఇస్తలేదు అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇక బయటకు వెళ్ళిపోయిన కాసేపటికి పోలీస్ ఆదేశాలను పెడ చెవిన పెట్టాడు.
కాగా చెప్పినా వినకుండా అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ప్రశాంత్ వెళ్లడంతో .. పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చంచల్ గూడా జైలు కి తరలించారు. అయితే అరెస్ట్ కి ముందు ప్రశాంత్ ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ‘నాకు సరిగా తిండి, నిద్ర లేదు. కొంచం ఫ్రీ అయ్యాక మీకు గంటలు గంటలు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పాను. కానీ కొందరు ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఏదేదో మాట్లాడారు. అది చాలా తప్పు.
ఆ నాలుగైదుగురి ఫోటోలు వీడియోలు మా వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు నన్ను కావాలనే నెగిటివ్ చేస్తున్నారు. నాకేమైనా అయితే వాళ్లదే బాధ్యత. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నా కోసం వచ్చిన జనాన్ని చూసి పరేషాన్ అయిన. నాకు ఇంత మంది సప్పోర్ట్ చేసారా అని. పోలీసులు వెనుక గేట్ నుంచి వెళ్లమన్నారు కానీ నేను ఒప్పుకోలేదు. నా కోసం ఇంత మంది వస్తే నేను దొంగలా వెనుక నుంచి వెళ్ళను అని అన్నాను. కొందరు కావాలనే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నాకేమైనా ఐతే ఆ ఐదుగురి ఫోటోలు బయటకు వస్తాయి అని చెప్పుకొచ్చాడు ప్రశాంత్.