బిగ్ బాస్-4 గత ఐదువారాలుగా ప్రసారం అవుతోంది. కరోనా సమయంలోనూ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ప్రారంభంలో చప్పగా సాగిన బిగ్ బాస్-4 క్రమంగా రక్తికట్టిస్తోంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఈవారం చివరి అంకానికి చేరుకోవడంతో ఎలిమినేషన్ గురించే చర్చ నడుస్తోంది.
Also Read: ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ అప్ డేట్ ఇదే
ఈ వారం నామినేట్ అయిన వారిలో యాంకర్ లాస్య.. నోయల్.. అఖిల్.. అభిజీత్.. మోనాల్.. సోహెయిల్.. సుజాత.. అరియానా.. అమ్మ రాజశేఖర్ ఉన్నారు. కిందటి వారం స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయింది. ఆమె బిగ్ బాస్ హౌజ్ కు వచ్చిన వారంలోనే ఎలిమినేట్ కావడంపై కంటెస్టులందరిలో టెన్షన్ మొదలైంది. దీనికితోడు బిగ్ బాస్ హోస్టు నాగార్జునా హౌస్ లో ఎంటట్మైంట్ చేయకపోతే స్వాతిదీక్షిత్ ల గేమ్ నుంచి వెళ్లాల్సి వస్తుందంటూ కంటెస్టులందరికీ వార్నింగ్ ఇచ్చాడు.
ఈ ప్రభావం తాజాగా జరిగిన హోటల్ టాస్కులో కన్పించింది. ఈ టాస్కులో కంటెస్టులు సేఫ్ గా ఆడుతూ ఇతరులను ఇరిక్కించే ప్రయత్నం చేశారు. తద్వారా హౌస్ లో ఎక్కువ రోజులు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ సైతం కంటెస్టుల మధ్య గోడవలు పెట్టే టాస్కులు ఇస్తుండటంతో గేమంతా ఆసక్తికరంగా మారుతోంది. అయితే ఈ వారం నామినేట్ అయినవారిలో ఇద్దరు కంటెస్టులు డేంజర్ జోన్లలో ఉన్నారు.
అమ్మ రాజశేఖర్.. సుజాతలు ఓటింగులో కొంత వెనకబడినట్లు తెలుస్తోంది. గురువారం వరకు జరిగిన ఓటింగ్ లెక్కలోకి తీసుకుంటే అమ్మరాజశేఖర్.. సుజాతలకు మిగతా కంటెస్టులతో పోలిస్తే తక్కువగా వచ్చాయట. వీరిలో సుజాత.. అమ్మరాజశేఖర్ మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉంది. అయితే సుజాత కంటే అమ్మ రాజశేఖర్ కు కొద్దిగా ఓట్లు ఎక్కువగా వచ్చాయనే టాక్ విన్పిస్తోంది.
Also Read: ఆపద్బాంధవుడు కి 28 సంవత్సరాలు !
అయితే ఓటింగ్ ఎటువైపునా మారే అవకాశం ఉంది. దీంతో వీరిద్దరి ఎవరు ఎలిమినేటర్ అవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఎలిమినేట్ ప్రక్రియపై అనేక విమర్శలు వస్తున్న తరుణంలో బిగ్ బాస్ వీరిద్దరిలో ఎవరి ఎలిమినేట్ చేస్తారనేది వేచి చూడాల్సిందే..!