Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ గత కొన్నేండ్లుగా వస్తున్న సీజన్లలో ఓ సాంప్రదాయం ఉంది. ప్రతి సీజన్‌లో కూడా అది వస్తూనే ఉంది. ఇప్పుడు నాన్ స్టాప్ లో కూడా ఆ ఘట్టం రానే వచ్చేసింది. అదేనండి కంటెస్టెంట్లు తమ పాత ప్రేమకథల గురించి చెప్పే ముచ్చట. అయితే తాజా ఎపిసోడ్‌లో అషు రెడ్డి తన గత ప్రేమ కథ గురించి చెప్పి అందరినీ షాక్‌కు గురి చేసింది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఈసారి కంటెస్టెంట్లకు తలపుతట్టని ప్రేమ అనే టాస్క్‌ను ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు తమ మొదటి ప్రేమ కథ గురించి కచ్చితంగా వెల్లడించాలి. ఇందులో భాగంగా కంటెస్టెంట్లు అందరూ తమ ప్రేమ కథ గురించి వివరించారు. కాగా అషురెడ్డి కూడా తన ఘాటు ప్రేమ కథను షేర్ చేసుకుంది. తనకు అప్పుడు 20 ఏళ్లు ఉన్నప్పుడే ఓ పర్సన్‌తో లవ్ లో పడ్డట్టు తెలిపింది.
Also Read: IPL Last ball six: ఇది కదా ఐపీఎల్ మ్యాచ్ అంటే.. నాడు ధోనీ.. నేడు తెవాటియా.. ఈ ఆట అద్భుతం..!
తాము ఎప్పుడు కలుసుకున్నా సరే తన నుదుటి మీద ముద్దుల వర్షం కురపించేవాడంటూ సిగ్గుపడింది. చాలా చిలిపి పనులు చేసేవాడంటూ చెప్పుకొచ్చింది. తామిద్దరం కలిసి ఎంతో ఎంజాయ్ చేశామంటూ వివరించింది. ఇలా తాము చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్న సమయంలోనే తమ ఇండ్లలో మ్యాటర్ తెలిసిపోయిందని.. దీంతో తనను తల్లిదండ్రులు హౌస్ అరెస్ట్ చేశారంటూ చెప్పుకొచ్చింది.
ఆ సమయంలో ముందు యూఎస్ వెళ్లి ఎంబీఏ కంప్లీట్ చేసుకుని రావాలంటూ చెప్పడంతో తాను అలాగే వెళ్లిపోయినట్టు చెప్పింది. అయితే తాను వెళ్లేముందు తన బాయ్ ఫ్రెండ్‌కు విషయం చెప్పగా.. అతను కూడా వస్తానని చెప్పాడు. కానీ రాకుండా ఉండిపోయాడు. ఒకసారి అతను విజిట్ వీసా మీద అమెరికాకు వస్తే.. కలిశానని కానీ అతని ప్రవర్తనలో తేడా చూసి దూరంగా ఉండాలనుకున్నట్టు చెప్పింది.
తాను ఎంబీఏ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత బాయ్ ఫ్రెండ్ తో పెండ్లి నిశ్చయించారు ఇంట్లోవారు. కానీ తనకు తన బాయ్ ఫ్రెండ్‌కు సెట్ కాదని డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందంట. ఆ సమయంలోనే చేతిని కోసుకున్నానని వెళ్లడించింది. ఇక తన ఫ్రెండ్ సలహా మేరకు అతన్ని వదిలేసినట్టు చెప్పింది అషురెడ్డి. ఇప్పుడు మొత్తం కెరీర్ మీదనే దృష్టిపెట్టినట్టు వివరించింది. అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ చెప్పింది. అషురెడ్డికి బ్రేకప్ చెప్పమని సలహా ఇచ్చిన ఫ్రెండ్ నే తన బాయ్ ఫ్రెండ్ పెండ్లి చేసుకున్నాడంట. అది తెలిసి షాక్ అయ్యానని చెప్పింది అషు.
Also Read:Rashmika Rejected Movies: బీస్ట్ మూవీ తో సహా.. రష్మిక వదులుకున్న పెద్ద సినిమాలు ఇవే…