https://oktelugu.com/

Bigg Boss Telugu OTT: Nataraj vs Bindu Madhavi: కంట్రోల్ తప్పిన నటరాజ్ మాస్టర్.. బిందుమాధవిపై మరీ నీచంగా..

Bigg Boss Telugu OTT: Nataraj vs Bindu Madhavi: బిగ్ బాస్ లో ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాల్సిన నటరాజ్ మాస్టర్ ను కంటెంట్ కోసమే ఉంచినట్టుగా అర్థమవుతోంది. ఆయన ప్రవర్తన మరీ శృతిమించిపోతోంది. పట్టపగ్గాల్లేకుండా సాగుతోంది. తనపై విమర్శలు చేస్తే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు నటరాజ్ మాస్టర్. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ ఓటీటీలో నామినేషన్స్ సందర్భంగా రెచ్చిపోయాడు. అతడి ప్రవర్తన.. తోటి కంటెస్టెంట్ బిందుమాధవిపై పర్సనల్ అటాక్ చేసిన తీరు చూసి అంతా షాక్ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 10, 2022 / 12:25 PM IST
    Follow us on

    Bigg Boss Telugu OTT: Nataraj vs Bindu Madhavi: బిగ్ బాస్ లో ఎప్పుడో ఎలిమినేట్ అయిపోవాల్సిన నటరాజ్ మాస్టర్ ను కంటెంట్ కోసమే ఉంచినట్టుగా అర్థమవుతోంది. ఆయన ప్రవర్తన మరీ శృతిమించిపోతోంది. పట్టపగ్గాల్లేకుండా సాగుతోంది. తనపై విమర్శలు చేస్తే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు నటరాజ్ మాస్టర్. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ ఓటీటీలో నామినేషన్స్ సందర్భంగా రెచ్చిపోయాడు. అతడి ప్రవర్తన.. తోటి కంటెస్టెంట్ బిందుమాధవిపై పర్సనల్ అటాక్ చేసిన తీరు చూసి అంతా షాక్ అయ్యారు.

    Nataraj, Bindu Madhavi

    నటరాజ్ మాస్టర్ తీరు చూస్తుంటే అతడి మైండ్ దొబ్బిందని కొందరు సోషల్ మీడియాలో ఆడిపోసుకుంటున్నారు. అసలు ఏంటీ ప్రవర్తన.. తెలుగు అమ్మాయి, హీరోయిన్ అయిన బిందుమాధవిని లోకల్ కాదని.. చెన్నై వెళ్లిపోతుంది ఈమె అంటూ నోరుపారేసుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.

    Also Read: Babu Gogineni vs CPI Narayana: బిగ్ బాస్ లొల్లి: సీపీఐ నారాయణ Vs బాబు గోగినేని.. ఎవరిది తప్పు?

    ప్రస్తుతం హౌస్ లో 8మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇందులో టాప్ 5లో ఐదుగురు మాత్రమే ఉంటారని.. ముగ్గురిని నామినేట్ చేయామని బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఆదేశించాడు. దీంతో బిందుమాధవి.. హౌస్ లోని నటరాజ్, అఖిల్, మిత్ర శర్మలను నామినేట్ చేసింది. ఇక అఖిల్ తో అయితే పెద్ద ఫైట్ నడిచింది. అఖిల్ కు బుర్రలేదంటూ బిందు ఫైర్ అయ్యింది.

    ఇక నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేసి అతడు ఎమోషన్స్ తో ఆడుతున్నాడని.. సెంటిమెంట్ తో హౌస్ లో కాలం వెళ్లదీస్తున్నాడని బిందు కారణం చెప్పింది. దీనికి నటరాజ్ రెచ్చిపోయాడు. బిందుపై వ్యక్తిగత దాడి చేశారు. బిందు వాళ్ల నాన్నను చెబుతూ ఇలాంటి కూతురును ఎలా కన్నావ్.. జ్ఞానం నేర్పించు అంటూ నోరుపారేసుకున్నాడు. తెలుగు అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు నీకు లేవు అంటూ నటరాజ్ మరింత రెచ్చిపోయాడు. నీలా నేను బెడ్ పై కూర్చొని కాళ్లు ఉపుతూ కూర్చోలేదని బిందుపై దారుణ వ్యాఖ్యలతో నటరాజ్ రెచ్చిపోయారు.

    Bindu Madhavi, Nataraj

    దీంతో బిందు ఏకంగా అఖిల్ మీదకు వెళ్లింది. ‘గో’ అంటూ సీరియస్ గా ఫైర్ అయ్యింది. నటరాజ్ కూడా బిందు మీదకు వెళ్లడంతో ఇద్దరు కొదమ సింహాల్లో దగ్గరకు వచ్చి వాదులాడుకున్నారు. గొడవ పెద్దది కావడంతో తోటి కంటెస్టెంట్లు వచ్చి ఆపి సర్దిచెప్పారు.

    మొత్తంగా బిగ్ బాస్ లో ఈ వారం నటరాజ్ మాస్టర్ కంట్రోల్ తప్పాడు. బిందుపై వ్యక్తిగత దాడితో ప్రేక్షకుల దృష్టిలో మరీ దిగజారిపోయారు. చూస్తుంటే ఈ వారం బిగ్ బాస్ నుంచి నటరాజ్ ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక నాగార్జున సైతం ఈ వారం నటరాజ్ మాస్టర్ ప్రవర్తనను ఏకిపారేయడం ఖాయం అని తెలుస్తోంది.

    Also Read:Mahesh Babu- Rajasekhar: రాజశేఖర్ మహేష్ సినిమాలో కన్ఫర్మ్.. దశ తిరుగుతుందా !

    Tags