Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లో తొలి రోజే ఏడ్చేసిన ముగ్గురు.. ఏంటా...

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లో తొలి రోజే ఏడ్చేసిన ముగ్గురు.. ఏంటా కారణాలు?

Bigg Boss 5 Telugu Day 2

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) తెలుగు రియాలిటీ షో ఘనంగా ప్రారంభమైంది. అగ్ర హీరో నాగార్జున(Nagarjuna)  దీన్నిగ్రాండ్ గా లాంచ్ చేశారు. ఏకంగా 19మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. ఫుల్లీ ఓవర్ లోడ్ గా ఉన్న ఈ సీజన్ లో తొలిరోజు అలకలు, సంతోషాలు, గిల్లి కజ్జాలు మొదలయ్యాయి.

తొలి రోజు ఇంటి సభ్యుల మధ్య పరిచయాలు, వారి గురించి విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అలాగే చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ తమ మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుకునే పనిలో పడ్డారు.

యూట్యూబర్ షణ్ముఖ్(Shanmukh), నటరాజ్ మాస్టర్ , నటుడు మానస్(Manas) లు ఎవరితో కలవకుండా ఒంటరిగా ఫీలవ్వడంపై ఇంటి సభ్యులు చర్చించుకున్నారు. తమకు అందరితో కలవడానికి కాస్త టైమ్ పడుతుందని వారు చెప్పుకొచ్చారు. యాంకర్ రవి వారికి ధైర్యం చెప్పాడు.

ఇక తొలి రోజు ముగ్గురు ఏడ్చేశారు. వీరిలో మొదట ట్రాన్స్ జెండర్ గా మారిన ప్రియాంక సింగ్ తను ట్రాన్స్ జెండర్ గా మారడానికి కారణాలు.. దానికి కుటుంబ సభ్యులు వద్దన్న తీరు.. నాన్నతో దీనిపై జరిగిన గొడవపై ఆర్జే కాజల్ కు చెప్పుకొన్ని కన్నీళ్ల పర్యంతం అయ్యింది. నాన్న నన్ను పట్టుకొని గడ్డాలు, మీసాలు ఏవీ అని అన్నాడని.. నేను ట్రాన్స్ జెండర్ గా మారిన విషయం ఆయనకు తెలియదని.. ఏం చెప్పాలో అప్పుడు తెలియక కళ్లల్లో నీళ్లు తిరిగాయని ప్రియాంక ఏడ్చేసింది.

ఇక ఆ తర్వాత సాయంత్రం ఎలిమినేషన్ ప్రక్రియలో ఇద్దరు ఏడ్చేశారు. ముఖ్యంగా ఇంట్లో అందరి వస్తువులు దాచేసి అల్లరి చేసిన మోడల్ జశ్వంత్ తీరును అందరూ వేలెత్తి చూపారు. దీంతో తన తప్పు లేకున్నా అందరూ నామినేట్ చేయడంపై అతడు బాగా ఏడ్చేశాడు.

ఇక మరో నటి ఫమీదా కూడా ఏడ్చేసింది. ఆమె చేష్టలకు ఇంటి సభ్యులంతా నామినేట్ చేసి తప్పును వేలెత్తి చూపడంతో కంటతడి పెట్టింది. నామినేషన్ ప్రక్రియలో అందరూ చిన్న చిన్న కారణాలతోనే నామినేట్ చేసుకోవడం కనిపించింది.

మొత్తంగా తొలిరోజే బిగ్ బాస్ హౌస్ లో కన్నీటి వరద పారింది. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్(Priyanka Singh), మోడల్ జశ్వంత్(Jashwanth), నటి ఫమీదా(Famida)లు ఏడ్చేశారు.

The Journey has begun..1st nominations will be a roller coaster ride! #BiggBossTelugu5 today @ 10 PM

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version