Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) తెలుగు రియాలిటీ షో ఘనంగా ప్రారంభమైంది. అగ్ర హీరో నాగార్జున(Nagarjuna) దీన్నిగ్రాండ్ గా లాంచ్ చేశారు. ఏకంగా 19మందిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారు. ఫుల్లీ ఓవర్ లోడ్ గా ఉన్న ఈ సీజన్ లో తొలిరోజు అలకలు, సంతోషాలు, గిల్లి కజ్జాలు మొదలయ్యాయి.
తొలి రోజు ఇంటి సభ్యుల మధ్య పరిచయాలు, వారి గురించి విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. అలాగే చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ తమ మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుకునే పనిలో పడ్డారు.
యూట్యూబర్ షణ్ముఖ్(Shanmukh), నటరాజ్ మాస్టర్ , నటుడు మానస్(Manas) లు ఎవరితో కలవకుండా ఒంటరిగా ఫీలవ్వడంపై ఇంటి సభ్యులు చర్చించుకున్నారు. తమకు అందరితో కలవడానికి కాస్త టైమ్ పడుతుందని వారు చెప్పుకొచ్చారు. యాంకర్ రవి వారికి ధైర్యం చెప్పాడు.
ఇక తొలి రోజు ముగ్గురు ఏడ్చేశారు. వీరిలో మొదట ట్రాన్స్ జెండర్ గా మారిన ప్రియాంక సింగ్ తను ట్రాన్స్ జెండర్ గా మారడానికి కారణాలు.. దానికి కుటుంబ సభ్యులు వద్దన్న తీరు.. నాన్నతో దీనిపై జరిగిన గొడవపై ఆర్జే కాజల్ కు చెప్పుకొన్ని కన్నీళ్ల పర్యంతం అయ్యింది. నాన్న నన్ను పట్టుకొని గడ్డాలు, మీసాలు ఏవీ అని అన్నాడని.. నేను ట్రాన్స్ జెండర్ గా మారిన విషయం ఆయనకు తెలియదని.. ఏం చెప్పాలో అప్పుడు తెలియక కళ్లల్లో నీళ్లు తిరిగాయని ప్రియాంక ఏడ్చేసింది.
ఇక ఆ తర్వాత సాయంత్రం ఎలిమినేషన్ ప్రక్రియలో ఇద్దరు ఏడ్చేశారు. ముఖ్యంగా ఇంట్లో అందరి వస్తువులు దాచేసి అల్లరి చేసిన మోడల్ జశ్వంత్ తీరును అందరూ వేలెత్తి చూపారు. దీంతో తన తప్పు లేకున్నా అందరూ నామినేట్ చేయడంపై అతడు బాగా ఏడ్చేశాడు.
ఇక మరో నటి ఫమీదా కూడా ఏడ్చేసింది. ఆమె చేష్టలకు ఇంటి సభ్యులంతా నామినేట్ చేసి తప్పును వేలెత్తి చూపడంతో కంటతడి పెట్టింది. నామినేషన్ ప్రక్రియలో అందరూ చిన్న చిన్న కారణాలతోనే నామినేట్ చేసుకోవడం కనిపించింది.
మొత్తంగా తొలిరోజే బిగ్ బాస్ హౌస్ లో కన్నీటి వరద పారింది. ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్(Priyanka Singh), మోడల్ జశ్వంత్(Jashwanth), నటి ఫమీదా(Famida)లు ఏడ్చేశారు.