Bigg boss Telugu 9 Agnipariksh Dammu Srija: బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) ప్రేక్షకులను ఎంతగానో ఊరించిన ‘అగ్ని పరీక్ష'(Agnipariksha) షో రీసెంట్ గానే హాట్ స్టార్ లో మొదలైంది. ఈ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ ని చూస్తుంటే చాలా విచిత్రం గా ఉన్నట్లు ప్రతీ ఒక్కరికి అనిపించింది. ఎక్కడి నుండి వస్తున్నారు రా మీరంతా అనే ఫీలింగ్ కొంతమందిని చూసిన తర్వాత అనిపించక తప్పదు. నిన్న విడుదలైన ప్రోమోలో దమ్ము శ్రీజా ని చూస్తే ఇదే ఫీలింగ్ కనిపించింది. ఎవరు ఈమె ఈ రేంజ్ అతి చేస్తుంది అని ఆ ప్రోమో క్రింద కామెంట్స్ చేశారు నెటిజెన్స్. అయితే మనం ప్రోమో లో చూసింది కేవలం ఒక్క శాతం మాత్రమే, జీవితం లో ఇలాంటి ఓవర్ యాక్షన్ మనిషిని ఎక్కడా చూసుండరు, ఒక లక్షణం కాకపోయినా, వేరే లక్షణం అయినా ఆడియన్స్ కి నచ్చేలా ఉండాలి, కానీ ఈమెని ఏ యాంగిల్ లో చూసినా చిరాకు అనే ఫీలింగ్ తప్ప మరొకటి కలగదు.
Also Read: ‘అగ్ని పరీక్ష’ లో అభిజిత్ ని మించిన తెలివైనోడు..దుమ్ములేపేసిన మనీష్!
అభిజిత్ ఈమె స్టేజి మీద ఉన్నంత సేపు ఆయన ముఖం లో వెయ్యి బూతులు వెతుక్కోవచ్చు, ఆ రేంజ్ లో చిరాకు పడ్డాడు. తిడుతాడేమో అని అంతా ఆశించారు కానీ, జస్ట్ మిస్ అయ్యింది. ముందుగా ఈమె స్టేజి మీదకు రాగానే పెద్దగా అరిచింది. ఆమె అరుపుకి శ్రీముఖి సైతం ఉలిక్కిపడింది. అనంతరం ఆమె శ్రీముఖి కి కానీ, జడ్జీలకు కానీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నోటికి వచ్చినట్టు మాట్లాడేసింది. మీకు టీఆర్ఫీ రేటింగ్స్ కావాలి, నేను దానికి కావాల్సిన కంటెంట్ ఇస్తాను, నన్ను సెలెక్ట్ చేయండి ఆమె జడ్జీలను డిమాండ్ చేసింది. అభిజిత్ కి సహనం నశించి అందరికంటే ముందు రెడ్ ఫ్లాగ్ ని ఇచ్చేసాడు. అప్పుడు ఆమె నన్ను చూసి అభిజిత్ భయపడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. నీ లాగా సైలెంట్ గా ఉండడం నా వల్ల కాదు అంటూ అభిజిత్ పై మళ్ళీ కౌంటర్లు వేసింది.
అమ్మాయి కాబట్టి సరిపోయావ్, అబ్బాయి అయ్యుంటేనా..అనే రేంజ్ ఎక్స్ ప్రెషన్స్ ని అభిజిత్ లో మనం చూడొచ్చు. ఇక బిందు మాధవి అయితే నువ్వు ఎదో ప్రయత్నం చేస్తున్నావు కానీ, మాకు నీ ప్రవర్తన చిరాకు కలిగించేలా అనిపించింది అని అంటుంది. అప్పుడు కూడా ఈమె నేనంటే నీకు భయం అని చెప్పుకొచ్చింది. నాకెందుకు భయం నేనేమైన బిగ్ బాస్ 9 లోకి వెళ్తున్నానా అని బిందు మాధవి అడగ్గా, మీరు ఓటీటీ సీజన్ పాల్గొన్నప్పుడు అందరూ ఆడపులి అని పిలిచేవారు కదా, నేనొస్తే ఆ ట్యాగ్ ని ఎక్కడ దోచేస్తానో అని మీకు భయం అంటూ చెప్పుకొచ్చింది దమ్ము శ్రీజా. అప్పుడు బిందు వెటకారం గా నవ్వుతూ అవును నాకు భయమే, ఇక పక్కకి వెళ్లి ఆడుకో అన్నట్టుగా ముఖం మీదనే చెప్పేసింది. కేవలం నవదీప్ మాత్రమే ఈమెకు గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈమె టాస్కులు బాగా ఆడి టాప్ 15 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చిందట. ఈమె హౌస్ లోకి రాకూడదు అని కోరుకోండి.