Bigg Boss Telugu 9 Agnipariksh Manish: ఇప్పటి వరకు ప్రసారమైన బిగ్ బాస్ సీజన్స్ అన్నిట్లో మాస్టర్ మైండ్ గేమర్ గా పేరు తెచ్చుకున్న కంటెస్టెంట్స్ ఎవరు అని అడిగితే మన అందరికీ గుర్తుకు వచ్చే మొట్టమొదటి పేరు అభిజిత్(Abhijeet). చాలా కూల్ గా, ఎలాంటి సందర్భాన్ని అయినా సమర్థవతంగా డీల్ చేసే సత్తా ఇతని సొంతం. అందుకే ఎన్ని సీజన్స్ వచ్చి వెళ్తున్నా కూడా ఆడియన్స్ కి ఎవర్ గ్రీన్ ఫేవరేట్ గా అభిజీత్ నిల్చిపోయాడు. అలాంటి అభిజీత్ కి కూడా మాస్టర్ మైండ్ క్యాటగిరీ లో దిమ్మ తిరిగే రేంజ్ షాక్ ఇచ్చాడు ‘అగ్ని పరీక్ష'(Agnipariksha) షోలో మనీష్ అనే కంటెస్టెంట్. ఇతను ముగ్గురు జడ్జీలకు విపరీతంగా నచ్చాడు. అభిజిత్ కూడా మెచ్చుకున్నాడు కానీ, ఆయన్ని ఇంకొక్క రౌండ్ లో చూసి నిర్ణయం తీసుకోవడం కోసం అభిజిత్ ఒక్కడే రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇతను ఇంకా టాప్ 15 లోకి వెళ్ళలేదు.
Also Read: కూకట్ పల్లి బాలిక హత్య కేసు.. వీడు మామూలోడు కాదు.. పోలీసులకే దిమ్మతిరిగిపోయింది
ఇతని గురించి మరిన్ని వివరాలు చూస్తే ఈయన ఒక పారిశ్రామిక వేత్త అట. ఇతనికి ఒక ఐటీ కంపెనీ కూడా ఉంది. అంతే కాదు, ఫోర్బ్స్ లిస్ట్ లో 33 వ వ్యక్తి గా కూడా నిలిచాడు. చాలా హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) షో లో పాల్గొనడం కోసం వచ్చాడు. అతని ప్రొఫైల్ కి జడ్జీలు అందరూ ఎంతో గౌరవం ఇచ్చారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ఎందుకు అనుకుంటున్నారు? అభిజిత్ అడగ్గా, దానికి మనీష్ సమాధానం చెప్తూ ‘నాకు బిగ్ బాస్ గేమ్ అంటే ఇష్టం. ఒక మనిషి తెలివైన స్ట్రాటజీలతో హౌస్ లోకి వెళ్లి గేమ్ ఆడితే ఎలా ఉంటుందో చూపించాలని అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ఆయన సమాధానాలకు అందరూ సంతృప్తి చెందారు. నవదీప్, బిందు మాధవి గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చేసారు. కానీ అభిజిత్ మాత్రం ఆయనకు ఒక ఆసక్తికరమైన టెస్ట్ పెట్టాడు.
మిమ్మల్ని మీరు ఆ తెల్లని చార్ట్ మీద బొమ్మ గీయండి అని అంటాడు. అతను బొమ్మ గీసే ముందు అభిజిత్ ఒక కండీషన్ పెడుతాడు. మీరు బొమ్మ గీసిన తర్వాత ఇది నేను రెడ్ ఫ్లాగ్ ఇవ్వకూడదు అంటే, మీరు గీసిన బొమ్మ ముఖం భాగంలో నా చేతిలో ఉన్న రెడ్ మార్కర్ ఇన్క్ పడకూడదు, ఎలా చేస్తారో చేయండి అని అంటాడు. అప్పుడు మనీష్ తల భాగాన్ని తుడిచివేస్తాడు. తల భాగం లేకపోతే మీరు రెడ్ మార్క్ అక్కడ వెయ్యలేరు కదా అని అంటాడు. అప్పుడు అభిజిత్ తో పాటు జడ్జీలు మొత్తం వావ్ అని మెచ్చుకుంటారు. కానీ అభిజిత్ కూడా గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి ఉండుంటే బాగుండేది అని చాలా మందికి అనిపించింది. చూడాలి మరి ఇతను అగ్నిపరీక్ష ని దాటుకొని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతాడా లేదా అనేది.