Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన కమెడియన్స్ టేస్టీ తేజ, అవినాష్, రోహిణి లు ఎంటర్టైన్మెంట్ ని పంచడం మాత్రమే కాకుండా, అద్భుతంగా గేమ్స్ ఆడుతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళని ఇష్టపడే వాళ్ళు ART టీం అని పిలుస్తుంటారు. ఇష్టపడని వాళ్ళు RAT టీం అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ పిలవడం వంటివి మనం చాలానే చూసాము. అయితే సోషల్ మీడియా లో ఒక సెక్షన్ ఆడియన్స్, విశ్లేషకుల నుండి వినిపిస్తున్న వాదన ఏమిటంటే, బిగ్ బాస్ ఈ ముగ్గురిని సేవ్ చేస్తూ వచ్చే విధంగా ఇన్ని రోజులు టాస్కులు డిజైన్ చేసారని. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు టీఆర్ఫీ రేటింగ్స్ ఇచ్చే కంటెంట్ ఉన్నవాళ్లు. వీళ్ళు పొరపాటున ఎలిమినేట్ అయితే షో చూసే వారి సంఖ్య తగ్గిపోతుంది, అసలే ఈ సీజన్ నష్టాల్లో నడుస్తుంది అనే ఉద్దేశ్యంతో వాళ్ళని నామినేషన్స్ లోకి రానివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారట.
ముఖ్యంగా రోహిణి కి హౌస్ లో చాలా మంది కంటెస్టెంట్స్ తో గొడవలు అయ్యాయి. కానీ ఆమె హౌస్ లోకి వచ్చి 8 వారాలు పూర్తి అయితే, ఒక్క వారం లో కూడా నామినేషన్స్ లోకి రాలేదు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం. అదే విధంగా టికెట్ టు ఫినాలే టాస్కులు కూడా నిన్న మొన్న జరిగిన రెండవ రౌండ్స్ వీళ్లకు అనుకూలంగా ఉంది. మొన్న మొదటి టాస్కులో గెలిచిన రోహిణి కి, రెండవ టాస్కులో బోలెడంత అడ్వాంటేజ్ ఇచ్చాడు బిగ్ బాస్. తీరికగా, ప్రశాంతంగా ఆమె బరువులను చూసుకొని తులాభారం టాస్కులో గెలిచేంత సమయం ఇచ్చాడు. మరోపక్క ఈ టాస్కులో మాస్టర్ మైండ్ గా అలోచించి ఆడిన గౌతమ్ మాత్రం గెలవలేదు. ఈ మాత్రం దానికి రెండవ టాస్క్ ని పెట్టడం ఎందుకు అని అనిపించేంత సిల్లీ గా బిగ్ బాస్ టీం ఈ టాస్కులను డిజైన్ చేసినట్టు అనిపించింది.
నిన్న జరిగిన రెండవ టాస్కులో కూడా ఇదే జరిగింది. అవినాష్ మొదటి టాస్కులో గెలిచినందుకు గాను 8 బాల్స్, అదే టాస్కులో రెండవ స్థానంలో నిల్చిన ప్రేరణకు 6 బాల్స్, మూడవ స్థానంలోకి వచ్చిన పృథ్వీ నాలుగు బాల్స్, నాల్గవ స్థానంలో నిల్చిన నబీల్ కి మూడు బాల్స్ వచ్చాయి. ఈ టాస్కులో ఎవరు గెలవబోతున్నారు అనేది కళ్ళకు కనిపించేస్తుంది అవినాష్ అని. ఈ మాత్రం దానికి ఎందుకు ఈ టాస్కుని నిర్వహించడం?, అవినాష్ కాకుండా ఓజీ క్లాన్ నుండి ఎవరైనా కంటెండర్ అయితే బిగ్ బాస్ ఇలాగే చేసేవాడా?, బిగ్ బాస్ ఉద్దేశ్యం కేవలం రోహిణి, అవినాష్ , టేస్టీ తేజలను టికెట్ టు ఫినాలే కంటెండర్స్ ని చెయ్యాలని, వాళ్ళ మధ్యలో పోటీని నిర్వహించి వాళ్ళకే టికెట్ రప్పించే ప్రయత్నం చేస్తున్నారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి వినిపిస్తున్న వార్త.