Bigg Boss Telugu 8: గత రెండు బిగ్ బాస్ సీజన్స్ లో లవ్ ట్రాక్స్ లేవు అనే విషయం మన అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 5 లో షణ్ముఖ్ – సిరి లవ్ ట్రాక్ దెబ్బకి బిగ్ బాస్ టీం మరోసారి కంటెస్టెంట్స్ మధ్య అలాంటి పరిస్థితులను కల్పించే సాహసం చెయ్యలేదు. కానీ ఈ సీజన్ లో మాత్రం హౌస్ లోకి కంటెస్టెంట్స్ ని పంపడమే జంటలుగా పంపాడు బిగ్ బాస్. కానీ ఒక్కరు కూడా తమకు బిగ్ బాస్ కేటాయించిన బడ్డీ తో కలిసి ఉండడం లేదు. ఎవరికీ ఇష్టమొచ్చిన వారితో వాళ్ళు ఉంటున్నారు. నిఖిల్ మరియు యష్మీ ని నాగార్జున జంటగా హౌస్ లోకి పంపిన సంగతి అందరికీ తెలిసిందే. కానీ నిఖిల్ ఎక్కువగా సోనియా కి కనెక్ట్ అయ్యాడు. ఈమె ఇతనితో స్నేహం చేసినప్పటి నుండి నిఖిల్ ఆట తీరే మొత్తం మారిపోయింది. ప్రతీ దానికి ఎమోషనల్ అయిపోతున్నాడు. నిఖిల్ ఇంత బలహీనుడా అని సోనియా అతనితో స్నేహం చేసేవరకు ఎవరికీ తెలియదు. ఇది ఇలా ఉండగా నేడు బిగ్ బాస్ రేషన్స్ ని గెలుచుకునే టాస్క్ కంటెస్టెంట్స్ కి ఇచ్చాడు.
ముందుగా యష్మీ క్లాన్ టాస్కు గెలిచి రేషన్ ని గెలుచుకుంది. కానీ కండీషన్ ఏమిటంటే ఏ క్లాన్ అయితే రేషన్ గెలుచుకుంటుందో, ఆ క్లాన్ సభ్యులు మాత్రమే రేషన్ ని పంచుకోవాలి. వండింది కూడా వాళ్ళ క్లాన్ లో ఉన్న వాళ్ళే తినాలి. సోనియా యష్మీ టీం కాబట్టి తాను గెలుచుకున్న రేషన్ ని నిఖిల్ కి ఇవ్వలేకపోతున్నాను అని అభయ్ ని పట్టుకొని గట్టిగ ఏడ్చేస్తుంది. ఇది గమనించిన నిఖిల్ సోనియా ని దగ్గరకు తీసుకొని ఓదారుస్తాడు. అంతే కాకుండా తాను ఉంటున్న లగ్జరీ రూమ్ లోకి సోనియా నిఖిల్ ని కూడా తీసుకెళ్లాలని అనుకుంటుంది. అది గేమ్ రూల్స్ కి పూర్తిగా విరుద్ధం, యష్మీ కూడా అదే చెప్తుంది. దీంతో నిఖిల్ నా వల్ల నీ గేమ్ పై ప్రభావం చూపకూడదు. నువ్వు ఫ్లో కి తగ్గట్టుగానే వెళ్ళిపో, నేనేమి అనుకోను అని నిఖిల్ అంటాడు.
సోనియా సరే అని లేచి వెళ్తుంది. ఇక్కడ జనాలకు అర్థం అవ్వని విషయం ఏమిటంటే, సోనియా కి నిఖిల్ అంటే నిజంగానే ప్రేమ ఉందా, లేదా ప్రేమ ఉన్నట్టుగా నటిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా నిఖిల్ గేమ్ పూర్తిగా చెడిపోవడానికి కారణం మాత్రం సోనియానే. అందులో ఎలాంటి సందేహం లేదు. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ రతిక మాయ నుండి బయటకి వచ్చి ఎలా అయితే గేమ్ లో తన విశ్వరూపం చూపించాడో, నిఖిల్ కూడా అలా తన విశ్వరూపం చూపిస్తాడని ఆడియన్స్ అనుకుంటున్నారు. అమర్ దీప్ కి కూడా గేమ్ కి సెట్ అయ్యేందుకు నాలుగు వారాలు పట్టింది, నిఖిల్ కి కూడా బాగా సమయం పట్టేట్టుగా అనిపిస్తుంది.