Bigg Boss Telugu 8(11)
Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ట్విస్టులకు కొదవే ఉండదు అన్నాడు హోస్ట్ నాగార్జున. కానీ ఆ ట్విస్టులు ఈ సీజన్ కొంప ముంచనుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. బిగ్ బాస్ ఇస్తున్న ట్విస్టులు ఆడియన్స్ లో విపరీతమైన నెగటివిటీ ని పెంచేలా చేస్తున్నాయి. సీజన్ 6 లో కంటెస్టెంట్స్ విషయం లో అన్యాయమైన ఎలిమినేషన్స్ జరగడం వల్ల ఆ సీజన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సీజన్ దానికి మించి ఫ్లాప్ అయ్యేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు. హౌస్ లో నిజాయితీ గా ఉంటూ, టాస్కులు బాగా ఆడుతూ, కామెడీ చేస్తూ, అందరినీ ఎల్లప్పుడూ నవ్వించే శేఖర్ బాషా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. గత వారం మొత్తం శేఖర్ బాషా కి సంబంధించిన ఫుటేజీ ని చూపించకపోవడం వల్లనే ఆయన ఎలిమినేషన్ అవ్వడానికి కారణం అయ్యాడని అంటున్నారు. శేఖర్ బాషా మొదటి వారం లో ఫుల్ జోష్ తో ఉండేవాడు.
జోక్స్ కూడా నాన్ స్టాప్ గా వేసేవాడు. కానీ రెండవ వారం చాలా డల్ అయిపోయాడు. దానికి కారణం ఆయన భార్య ప్రెగ్నన్సీ తో ఉండడమే. డాక్టర్లు ఆమెకి నిన్ననే డెలివరీ డేట్ ఇచ్చారు. సురక్షితంగా డెలివరీ అవుతాడా లేదా అనే భయం తో శేఖర్ బాషా రెండవ వారం మొత్తం డల్ గా కూర్చున్నాడు. అందుకే ఆయనకి సంబంధించిన ఫుటేజీ ఏమి రాలేదు. గత వారం మొత్తం ఎపిసోడ్స్ కాలుపుకున్నా కూడా శేఖర్ బాషా కి కనీసం 5 నిమిషాల ఫుటేజీ కూడా బయటకి రాలేదు. ఇది ఆయనకి చాలా మైనస్ అయ్యింది. ఏది ఏమైనా సరిగ్గా ఆయనకి కొడుకు పుట్టే సమయానికి ఇంట్లో ఉంటున్నాడు. ఆయన ఎలిమినేట్ అయ్యాడు అనే బాధకంటే, కొడుకు ని కళ్లారా చూసుకున్నాను, చేతులతో పైకి ఎత్తుకున్నాను అనే తృప్తి అయినా మిగులుతుంది అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా రెండు వారాలు శేఖర్ బాషా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు గానూ ఆయనకి 5 లక్షల రూపాయిలు రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. అంటే వారానికి 2.5 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అన్నమాట.
బాషా ఈ ఒక్క వారం యాక్టీవ్ గా ఉండుంటే ఆయన కనీసం 9 వారాలు హౌస్ లో ఉండేవాడు, 20 లక్షల రూపాయలకు పైగా డబ్బులు సంపాదించుకొని బయటకి వెళ్ళేవాడు, కానీ పాపం బ్యాడ్ లక్. హౌస్ లో ఉన్న ప్రతీ కంటెస్టెంట్ మంచి సెటప్ తో వచ్చారు. వీళ్ళు హౌస్ లో ఉన్నన్ని రోజులు కొన్ని కార్పొరేట్ కంపెనీ వాళ్ళు ఓట్ల విషయం లో బాగా సహాయం చేస్తారు. కానీ శేఖర్ బాషా అలాంటి సెటప్ తో అడుగుపెట్టలేదు, ఆయనకి ఎలాంటి పీఆర్ టీం లేదు, అందుకే ఆయన ఇంత తొందరగా ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Bigg boss telugu 8 shekhar basha out of the bigg boss house do you know how much remuneration he took for 2 weeks