Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో ఏ కంటెస్టెంట్ అయినా కేవలం కొంత కాలం మాత్రమే నటించగలరు. సీజన్ మొత్తం నటించడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ సీజన్ లో ఎదురయ్యే సందర్భాలు, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. ఎదో ఒక సందర్భంగా కంటెస్టెంట్స్ వేసుకునే ముసుగులు తొలగిపోతాయి. నిఖిల్ ని చాలా మంది హౌస్ లో మాస్క్ వేసుకొని నటిస్తున్నాడని అనుకున్నారు. ఇప్పటికీ అయన మాస్క్ వేసుకొనే గేమ్స్ ఆడుతున్నాడని లోపల ఉన్న హౌస్ మేట్స్ తో పాటు, చాలా మంది ప్రేక్షకులు కూడా అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. నిజంగానే నిఖిల్ చాలా మంచి వ్యక్తి. ఇది ప్రతీ సందర్భంలోనూ ఆయన నిరూపిస్తూనే ఉన్నాడు. నిన్న ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ లో కూడా నిఖిల్ మరోసారి తన మంచి మనసుని చాటుకున్నాడు. హౌస్ లో ప్రస్తుతం ఆయనకీ శత్రువు ఎవరైనా ఉన్నారా అంటే అది నిఖిల్ మాత్రమే.
ఎందుకంటే గౌతమ్ టైటిల్ కొట్టడానికి అడ్డంగా నిలబడింది నిఖిల్ మాత్రమే, హౌస్ లో వీళ్లిద్దరి మధ్య ఎన్నో గొడవలు కూడా జరిగాయి. కానీ నిన్న జరిగిన ‘టికెట్ టు ఫినాలే’ టాస్క్ లో గౌతమ్ కి ఎవరూ సపోర్టు చేయలేదు, ఒక్క నిఖిల్ తప్ప. రెండు రౌండ్స్ లోనూ నిఖిల్ గౌతమ్ కి సలహాలు ఇచ్చాడు. కేవలం గౌతమ్ కి ఒక్కటే ఆయన సలహాలు ఇవ్వలేదు, గేమ్ లో ఆడుతున్న ప్రతీ ఒక్కరికి ఆయన సలహాలు ఇచ్చాడు. ఒక విన్నర్ కి ఉండాల్సిన లక్షణం ఇదే. టాస్కులు బాగా ఆడాలి, అదే సమయంలో మానవత్వం కూడా చూపించాలి. అప్పుడే ఆడియన్స్ కి నచ్చుతాడు. గత నాలుగు వారాల నుండి గౌతమ్ కి నాన్ స్టాప్ గా ఒక రేంజ్ పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిఖిల్ కంటే ఇంకా తక్కువ గానే ఓటింగ్ లో ఉన్నాడంటే, జనాలు నిఖిల్ ని ఏ రేంజ్ లో ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
కేవలం నిఖిల్ లో మాత్రమే కాదు, గౌతమ్ లో కూడా ఇలాంటి లక్షణాలు చాలానే ఉన్నాయి. తనని హౌస్ లో తక్కువ చేసి మాట్లాడుతూ, ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకున్న ప్రేరణ కి కూడా కష్టసమయంలో సహాయం చేసిన గుణం గౌతమ్ సొంతం. హౌస్ లో ఎవరు అయితే నిజాయితిగా ఆడుతున్నారో, వాళ్లకు గౌతమ్ అవసరం పడినప్పుడల్లా సహాయం చేస్తున్నాడు. ఉదాహరణకి సీత హౌస్ లోపలకు వచ్చి నిఖిల్ పై దారుణమైన నిందలు వేసి వెళ్తుంది. నిఖిల్ అందుకు ఎమోషనల్ గా చాలా డౌన్ అవుతాడు. ఆరోజు అన్నం తినకుండా పడుకుంటాడు. ఆ సమయంలో నిఖిల్ ని ఓదార్చడానికి రూంలోకి వెళ్లిన వారిలో గౌతమ్ కూడా ఒకడు. అదే విధంగా స్విమ్మింగ్ పూల్ వద్ద కూడా నిఖిల్ కి గౌతమ్ చాలా ధైర్యం చెప్తాడు. వీళ్ళిద్దరిలో ఇలాంటి విన్నర్ లక్షణాలు చాలానే ఉన్నాయి. ఎవరు గెలుస్తారో చూడాలి.