https://oktelugu.com/

Bigg Boss Telugu 8: 11వ వారం నామినేషన్స్ లోకి వచ్చిన 6 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే..మొత్తానికి కన్నడ బ్యాచ్ అనుకున్నది సాధించారు!

ఈ వారం మాత్రం కచ్చితంగా ఓజీ క్లాన్ నుండి ఒక ఎలిమినేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో టేస్టీ తేజ, అవినాష్, యష్మీ, పృథ్వీ , విష్ణు ప్రియా ,గౌతమ్ నామినేట్ అయ్యారు.

Written By:
  • Vicky
  • , Updated On : November 11, 2024 / 07:50 AM IST

    Bigg Boss Telugu 8(213)

    Follow us on

    Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయ్యి అప్పుడే 10 వారాలు పూర్తి అయ్యింది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా 8 మంది అడుగుపెడితే, నిన్న హరితేజ ఎలిమినేషన్ తో కేవలం నలుగురు మిగిలారు. అయితే ఓజీ క్లాన్ నుండి వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత ఒక్కరు కూడా ఎలిమినేట్ అవ్వకపోవడం గమనార్హం. పృథ్వీ , నిఖిల్,ప్రేరణ, యష్మీ , నభీల్ , విష్ణు ప్రియ వంటి వారు ఆరవ వారం నుండి రెగ్యులర్ గా నామినేషన్స్ లోకి వస్తున్నప్పటికీ సేవ్ అవుతూ వస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ వచ్చిన కొత్తలో నిఖిల్ అందరూ కలిసికట్టుగా ఉండాలి, వైల్డ్ కార్డ్స్ ని బయటకి పంపేయాలి అని తన టీం మేట్స్ అందరికీ ఏదైతే చెప్పాడో, అది నిజం చేస్తున్నారు. అయితే ఈ వారం మాత్రం కచ్చితంగా ఓజీ క్లాన్ నుండి ఒక ఎలిమినేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో టేస్టీ తేజ, అవినాష్, యష్మీ, పృథ్వీ , విష్ణు ప్రియా ,గౌతమ్ నామినేట్ అయ్యారు.

    వీరిలో గౌతమ్ కి అందరికంటే టాప్ ఓటింగ్ పడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాతి స్థానం లో యష్మీ ఉండొచ్చు. ఎందుకంటే ఆమె స్నేహితులు నిఖిల్,ప్రేరణ నామినేషన్స్ లో లేరు కాబట్టి, వాళ్ళ అభిమానుల ఓట్లు యష్మీ కి పడొచ్చు. ఇక మూడవ స్థానంలో టేస్టీ తేజ ఉండొచ్చు. ఇతను మాట్లాడే తీరు, టాస్కులు ఆడే విధానం, ఎంటర్టైన్మెంట్ పంచడం వంటివి ఆడియన్స్ కి బాగా అనిపించింది. అందుకే ఇతను మూడవ స్థానంలో స్థిరపడొచ్చు. ఇక నాల్గవ స్థానంలో విష్ణుప్రియ ఉండొచ్చు. మొదటి నుండి ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది, మొదటి వారం నుండి ఆమెకి ఒకే రేంజ్ లో ఓట్లు పడుతున్నాయ్. ఇక చివరి రెండు స్థానాల్లో పృథ్వీ, అవినాష్ ఉండొచ్చు. వీళ్ళిద్దరిలో పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    కారణం నభీల్ చేతిలో ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ ఉంది..అవినాష్ నభీల్ కి బాగా క్లోజ్ అయ్యాడు , అదే విధంగా నభీల్ కి అవినాష్ మెగా చీఫ్ టాస్క్ లో పూర్తిగా సపోర్టు చేయడం వల్ల నభీల్ విశ్వాసం చూపిస్తూ అవినాష్ ని సేవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారం అవినాష్ , టేస్టీ తేజ, రోహిణి లను నామినేషన్స్ లోకి తీసుకొని రావాలని కన్నడ బ్యాచ్ ముందుగానే చర్చించుకున్నారు. అనుకున్నట్టుగానే అవినాష్, టేస్టీ తేజ ని నామినేషన్స్ లోకి తీసుకొని రావడంలో సక్సెస్ అయ్యారు. రోహిణి ని కూడా నామినేషన్స్ లోకి తీసుకొని వచ్చి ఉండొచ్చు కానీ, మెగా చీఫ్ ప్రేరణ ఆమె తన పవర్ నుండి నామినేషన్స్ నుండి కాపాడి ఉండొచ్చు. ఇది ఇలా ఉండగా టేస్టీ తేజ ని నామినేషన్స్ లో చాలా టార్గెట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.