Bigg Boss Telugu 8(7)
Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ ప్రారంభం కాగానే మనకి స్ట్రాంగ్ గా అనిపించిన కంటెస్టెంట్స్ లో ఒకరు నిఖిల్. బయట ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఈయన గేమ్ తీరు చూసి ప్రతీ ఒక్కరు ఈ సీజన్ లో టైటిల్ గెలుచుకొని పోతాడు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తుంటే నిఖిల్ అందరికంటే వీక్ కంటెస్టెంట్ గా అనిపిస్తున్నాడు. నాగ మణికంఠ సీజన్ ప్రారంభం లో చాలా ఎమోషనల్ గా అనిపించాడు. కానీ నిఖిల్ అతని కంటే ఎమోషనల్ గా అనిపిస్తున్నాడు. ప్రతీ దానికి సర్దుకుపోయేతత్వం, ఎదుటి మనిషిని బాధపెట్టకూడదు అనుకునే తీరు, అందరినీ సంతృప్తి పరచాలనే ఆలోచన, బిగ్ బాస్ గేమ్ ఆడేందుకు ఎలాంటి లక్షణాలు అయితే ఉండకూడదో, అలాంటి లక్షణాలు మొత్తం నిఖిల్ లో ఉన్నాయి. హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే నాగ మణికంఠ ఇతనికి ధైర్యం చెప్పి, నీతులు చెప్పే రేంజ్ కి వచ్చేసాడు. ఉదాహరణకు నేడు యష్మీ క్లాన్ కాకుండా, మిగిలిన రెండు క్లాన్స్ కి సంబంధించిన వారు చెప్పిన రేషన్ తీసుకొని రావాలని బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు.
ఈ టాస్క్ లో నైనికా క్లాన్ నుండి సీత ని పంపిస్తుంది. ఇక నిఖిల్ క్లాన్ నుండి నేనే వస్తాను బిగ్ బాస్ అని అంటాడు నిఖిల్. ఇంతలోపు మణికంఠ మూతి ముడుచుకొని కూర్చోవడం గమనిస్తాడు నిఖిల్. అతనికి సర్దిచెప్పే ప్రయత్నం నిఖిల్ చేస్తాడు కానీ, మణికంఠ తగ్గడు. దీంతో నిఖిల్ ఇక చేసేది ఏమి లేక సంచాలక్ గా వ్యవహరిస్తున్న యష్మీ కి నేను రావడం లేదు, నా బదులుగా మణికంఠ వస్తాడు అని చెప్తాడు. దీంతో ఒక్కసారిగా యష్మీ కూడా షాక్ కి గురి అవుతుంది. ఇక ఆ తర్వాత మణికంఠ గేమ్ ఆడుతాడు, ఓడిపోతాడు. నిఖిల్ టాస్క్ ప్రారంభం లో కష్టపడి తీసుకొచ్చిన రేషన్ మొత్తాన్ని తిరిగి స్టోర్ రూమ్ లో పెట్టి, కేవలం రాగి పిండి మాత్రమే తీసుకొని రావాల్సిన పరిస్థితి. వారం మొత్తం బిగ్ బాస్ రాగి తోనే వంటకాలు వండుకొని తినమంటాడు బిగ్ బాస్. ఆ తర్వాత కాసేపటికి బిగ్ బాస్ నిఖిల్ క్లాన్ కి పలు ఐటమ్స్ ఇస్తాడు.
కానీ వాటిని వండుకునేందుకు వీలు లేదట. ఎలా ఇచ్చారో అలాగే తినాలట. పచ్చి కూరగాయలను ఎవరు మాత్రం తినగలరు చెప్పండి. నిఖిల్ మణికంఠ ని పంపకుండా తాను వెళ్లుంటే కచ్చితంగా గెలిచేవాడు. ఈ వారం మొత్తం ఇలా రేషన్ లేకుండా ఉండే పరిస్థితి వచ్చేది కాదు. ఇలా ప్రతీ విషయం లో అతి మంచితనం కి పోయి తన గేమ్ ని సర్వ నాశనం చేసుకుంటున్నాడు. రోజురోజుకి అతని గ్రాఫ్ పడిపోతూ వెళ్తుంది. ఇలాగే కనుక కొనసాగితే భవిష్యత్తులో ఈయన టాప్ 5 కాదు కదా, ఇంకా ముందే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వొచ్చు, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఆడుతాడు అనేది.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
View Author's Full InfoWeb Title: Bigg boss telugu 8 nikhil has to fast for a week because of his goodness