https://oktelugu.com/

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎవ్వరూ బ్రేక్ చేయలేని రికార్డు నెలకొల్పిన నిఖిల్..పల్లవి ప్రశాంత్ కూడా దరిదాపుల్లో లేడుగా!

నిఖిల్ తో ఎవరైనా తలపెడితే, ఇక ఫిక్స్ అయిపోవచ్చు అవతల వాళ్ళు ఓడిపోతారని. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాక ముందు నిఖిల్ డామినేషన్ ఈ స్థాయిలో ఉండేది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు వారాలు చీఫ్ గా కొనసాగిన కంటెస్టెంట్ గా నిఖిల్ కి ఒక ట్రాక్ రికార్డు ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 1, 2024 / 09:45 AM IST

    Bigg Boss Telugu 8(187)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు అంటే నిఖిల్,నిఖిల్ అంటే టాస్కులు అన్నట్టుగా మారిపోయింది. ఎలాంటి టాస్క్ లో అయినా తన వంద శాతం ఎఫోర్ట్స్ పెడుతాడు. కండబలంతో పాటుగా బుద్ధి బలం కూడా ఉపయోగిస్తాడు. అందుకే మొదటి వారం నుండి ఇప్పటి వరకు ఆయన పాల్గొన్న టాస్కులన్నీ 99 శాతం గెలిచాడు. ఇలాంటి రికార్డు బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్స్ కి లేదు. హిందీ, కన్నడ, తమిళం మరియు మలయాళం బిగ్ బాస్ షోస్ ని కలిపి చూసుకున్నా కూడా ఈ స్థాయి స్ట్రైక్ రేట్ ఉన్న కంటెస్టెంట్ మరొకరు లేదు. గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ టాస్కుల విషయంలో ఇదే విధమైన దూకుడు ని ప్రదర్శించేవాడు. అయితే ఆయన కూడా కొన్ని టాస్కులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి, కానీ నిఖిల్ మాత్రం ఒక్క టాస్క్ లో కూడా ఓడిపోలేదు. సొంతంగా ఆడే టాస్కుల్లో అయినా, గ్రూప్ గా ఆడే టాస్కుల్లో అయినా నిఖిల్ దే పైచేయి.

    ఈ వారం కూడా ఆయన బ్లూ టీం తరుపున టాస్కులన్నీ ఆడి గెలిపించాడు. నిఖిల్ తో ఎవరైనా తలపెడితే, ఇక ఫిక్స్ అయిపోవచ్చు అవతల వాళ్ళు ఓడిపోతారని. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రాక ముందు నిఖిల్ డామినేషన్ ఈ స్థాయిలో ఉండేది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు వారాలు చీఫ్ గా కొనసాగిన కంటెస్టెంట్ గా నిఖిల్ కి ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఈయన దూకుడుకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరో ఒకరు అడ్డుకట్ట వేస్తారని ఊహించారు. మెహబూబ్ ప్రయత్నం చేసి ఓడిపోయాడు, ఇప్పుడు గౌతమ్ పరిస్థితి కూడా అంతే ఉంది. వీళ్లిద్దరి మధ్య గొడవలు అయితే బాగానే జరుగుతున్నాయి కానీ, టాస్కుల విషయంలో మాత్రం నిఖిల్ కి పోటీ ని ఇవ్వలేకపొతున్నాడు గౌతమ్. మొదటి వారంలో మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ లో 12 మంది హౌస్ మేట్స్ ని ఒంటి చేత్తో ఓడించి గెలిచేలోపు, అబ్బో గౌతమ్ మామూలోడు కాదు, నిఖిల్, పృథ్వీ కి సమానమైన పోటీదారుడు అనే పేరొచ్చింది.

    కానీ ఆ టాస్క్ లో నిఖిల్, పృథ్వీ పాల్గొనలేదు కాబట్టే గౌతమ్ గెలిచాడు అనేది నెటిజెన్స్ చెప్తున్న మాట. ఇదంతా పక్కన పెడితే భవిష్యత్తులో గౌతమ్, నిఖిల్ మధ్య గొడవలు చాలానే జరిగే అవకాశం ఉంది. ఇలా ఇలా ఉండగా నిఖిల్ కి సరిసమానమైన పోటీ ఎవరైనా హౌస్ లో ఉన్నారా అంటే, అది పృథ్వీ అని చెప్పొచ్చు. ఇతనికి నిఖిల్ కంటే ఎక్కువ బలం ఉంది. గత వారం ఆడిన బస్తాల టాస్క్ లో పృథ్వీ ఇద్దరినీ రెండు చేతులతో ఆపేసాడు. దీనిని బట్టి ఆయన స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారైనా హౌస్ లో నిఖిల్ కి పృథ్వీ కి మధ్య ఒక టాస్క్ జరిగితే చూడాలని కోరుకుంటున్నారు నెటిజెన్స్.