Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 సరిగ్గా మరో పది రోజుల్లో ముగియబోతుంది. నిన్న గాక మొన్ననే మొదలైనట్టు అనిపించిన ఈ సీజన్ అప్పుడే చివరికి చేరుకోవడం కాస్త ఆశ్చర్యమే. సీజన్ 7 తో పోలిస్తే టాస్కులు చాలా తక్కువే జరిగాయి కానీ, కంటెస్టెంట్స్ మధ్య ఉన్న ఎమోషన్స్ బాగా క్లిక్ అవ్వడంతో ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. కేవలం టెలివిజన్ పరంగా మాత్రమే కాదు, హాట్ స్టార్ లో కూడా ఈసారి మంచి వ్యూయర్షిప్ వచ్చింది. ఇది ఇలా ఉండగా ఈ వారం మొత్తం కంటెస్టెంట్స్ కి ‘ఓట్ ఫర్ అప్పీల్’ టాస్కులు జరిగాయి. ఆడియన్స్ ని ఓట్లు అడిగేందుకు లోపల ఉన్న కంటెస్టెంట్స్ అందరూ చాలా కసిగా ఈ టాస్కులను ఆడారు. మొన్న జరిగిన టాస్కులలో ప్రేరణ గెలిచి ఆడియన్స్ ని ఓట్ అప్పీల్ చేయగా, నిన్న నబీల్ గెలిచి ఓట్ అప్పీల్ చేసుకున్నాడు.
నిన్న మొదటి టాస్కులో ప్రేరణ గెలుస్తుంది. రెండవ టాస్కులో నబీల్, విష్ణు ప్రియ విజేతలుగా నిలుస్తారు. వీరిలో ఎవరో ఒకరికి మాత్రమే ఓటుని అప్పీల్ చేసుకునే అవకాశం రాగా, హౌస్ మేట్స్ అందరూ నబీల్ పేరుని ఎంచుకొని చెప్తారు. ఆ తర్వాత నబీల్ ఆడియన్స్ ని ఓటు రిక్వెస్ట్ చేస్తాడు. ఇంతకీ టాస్క్ ఏమిటంటే, హౌస్ మేట్స్ అందరిని యాక్షన్ రూమ్ లో ఏర్పాటు చేసిన ఒక రౌండ్ సర్కిల్ లో వేసి, వాళ్ళ మధ్య తోపులాట పెట్టి, ఒకరిని ఒకరు తోసుకున్న తర్వాత చివర్లో ఎవరైతే మిగులుతారో, వాళ్ళు గెలిచినట్టు అని బిగ్ బాస్ చెప్తాడు. ఈ టాస్క్ లో నిఖిల్, గౌతమ్, రోహిణి అద్భుతంగా ఆడుతారు. ముఖ్యంగా రోహిణి ఆట తీరుకి హౌస్ మేట్స్ మొత్తం చప్పట్లు కొడుతారు. ముందుగా ప్రేరణ ఈ టాస్క్ నుండి అవుట్ అవుతుంది. ఆ తర్వాత నబీల్, నిఖిల్, రోహిణి, విష్ణు వీళ్లంతా కలిసి గౌతమ్ ని అవుట్ చేస్తారు.
ఈ పెనుగులాటలో గౌతమ్ కి దెబ్బలు బాగా తగులుతాయి. ఆ తర్వాత వీళ్ళు నిఖిల్ ని టార్గెట్ చేసి బయటకి నెట్టేస్తారు. నిఖిల్ కీప్ కూడా చాలా బలమైన దెబ్బలే తగులుతాయి, కానీ తనని తానూ బాగా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత అవినాష్ అవుట్ అవుతాడు. ఇక చివరికి నబీల్, విష్ణు ప్రియ, రోహిణి మిగులుతారు. నబీల్, విష్ణు ప్రియ కలిసి రోహిణి ని ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తారు. రోహిణి సుమారుగా అరగంటసేపు తనని తానూ డిఫెండ్ చేసుకుంటూ అవుట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఆమె ఒక్కటే డిఫెండ్ చేసుకున్న తీరుని చూస్తే ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. చివరికి నబీల్, విష్ణు ప్రియ కూడా రోహిణి కి చప్పట్లు కొడుతారు. అంత అద్భుతంగా ఆడుతుంది రోహిణి. అలా ఈ ముగ్గురు ఓడిపోయినప్పటికీ షో స్టీలర్స్ గా పేరు తెచ్చుకున్నారు.