Bigg Boss Telugu 8: తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు మగవాళ్లే టైటిల్ విన్నర్స్ గా నిలుస్తూ వచ్చారు కానీ, ఒక్క లేడీ కంటెస్టెంట్ కి కూడా టైటిల్ రాలేదు. బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో ఒక్కటే లేడీ కంటెస్టెంట్ బిందు మాధవి టైటిల్ ని గెలిచింది. అయితే ఈ సీజన్ లో ఆడ పులి గా పిలవబడుతున్న ప్రేరణకు టైటిల్ గెలిచేందుకు అన్ని విధాలుగా అర్హతలు ఉన్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మగవాళ్ళతో సమానంగా ఈమె ఆడిన తీరుకి సెల్యూట్ చేయాల్సిందే. అయితే బిగ్ బాస్ టీం ఈసారి కూడా మగవాళ్లకు టైటిల్ ని రప్పించే విధంగా గేమ్ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేరణ ఆడుతున్న తీరుకి కచ్చితంగా ఆమెకు హోస్ట్ నాగార్జున నుండి బలమైన ప్రశంసలు రావాలి, కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రశంసలు రాలేదు. ఈ విషయం లో ఆడియన్స్ కి మాత్రమే కాదు, ప్రేరణలో కూడా ఒక చిన్న అసంతృప్తి ఉంది. ముఖ్యంగా మూడవ వారం లో ఈమె ఆడపులి లాగ విరుచుకొని పడుతూ ఆడిన తీరు ఏదైతే ఉందో, అది అద్భుతం అనే చెప్పాలి.
మగవాళ్ళు సైతం ఈమె వైపు రావాలంటే వణికిపోయారు. పాపం ఆరోజు ఆడిన ఆటలకు ఈమె రెండు చేతులు మొత్తం దెబ్బలతో నిండిపోయాయి. ఇలాగే మణికంఠ కి జరిగి ఉండుంటే ఏ రేంజ్ లో నాటకాలు వేసేవాడో మన అందరికీ తెలిసిందే. కానీ ప్రేరణ మాత్రం వాటి గురించి చెప్పుకోలేదు. కేవలం తన ఆట మీద మాత్రమే ఫోకస్ పెట్టింది. ఆ వారం ప్రేరణకు నాగార్జున ప్రత్యేకంగా అభినందిస్తాడని అందరూ అనుకున్నారు, కానీ అలా చేయలేదు. ఇక ఈ వారం ప్రేరణ ఆడిన ఆట బిగ్ బాస్ చరిత్రలో ఏ అమ్మాయి కూడా ఆడలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడవాళ్లకు పీరియడ్స్ సమయంలో ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శరీరం లోని చెడు నెత్తురు మొత్తం పోతుంది, శరీరం మొత్తం నీరసించి పోతుంది, అడుగు తీసి అడుగు కూడా వేయలేని పరిస్థితి లో ఉంటారు. గత వారం ప్రేరణకు పీరియడ్స్ జరిగింది. కానీ తనకు ఆరోగ్యం బాగాలేదని చిన్న కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. చీఫ్స్ కంటెండర్స్ టాస్కులో ఆమె హౌస్ లో అద్భుతంగా టాస్కులు ఆడే నిఖిల్, నబీల్ లాంటి బలమైన కంటెస్టెంట్స్ తో పోటీ పడుతూ చివరి వరకు గేమ్ ఆడింది.
ఆమె వేగంగా పరిగెత్తిన విధానం కి చేతులెత్తి మొక్కిన తప్పు లేదు. ప్రేరణ ని నాగార్జున ఈ వారం ప్రత్యేకించి పొగుడుతాడు, కానీ ఎదో నామమాత్రం గానే పొగుడుతాడు. ఇది ఆమె అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. ఆమెకి ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా మగవాళ్ళతో సమానంగా పరిగెత్తి గేమ్ ని ఆడింది అని నాగార్జున చెప్పి ఉండుంటే, ప్రేరణ గ్రాఫ్ ఎవ్వరూ ఊహకి అందని విధంగా ఉండేది, కానీ ఉద్దేశపూర్వకంగానే ఆ పని చేయలేదు. ఎంతసేపు వింత జీవి లాగ బ్రతికే మణికంఠ గ్రాఫ్ ని పెంచే విధమైన సందర్భాలు సృష్టిస్తున్నారు కానీ, ప్రేరణ లాంటి బలమైన కంటెస్టెంట్స్, ఇంకా బలంగా తయారు అయ్యేందుకు మాత్రం స్కోప్ ఇవ్వడం లేదు బిగ్ బాస్.