https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘ఎవిక్షన్ పాస్’ అవినాష్ కోసం వాడినందుకు నబీల్ పై ఫైర్ అయిన ప్రేరణ..మరీ ఇంత స్వార్థమా?

నిన్న మరోసారి తన మాస్కుని తొలగించి ప్రేరణ తన గేమ్ ని మొత్తం డౌన్ చేసుకుంది అని చెప్పొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న ఎలిమినేట్ అయిన అవినాష్ ని నబీల్ తన వద్ద ఉన్నటువంటి 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' ని ఉపయోగించి సేవ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Written By: Vicky, Updated On : November 18, 2024 8:42 am
Bigg Boss Telugu 8(223)

Bigg Boss Telugu 8(223)

Follow us on

Bigg Boss Telugu 8: ప్రేరణ హౌస్ లో ఎవరితోనూ నిజమైన స్నేహం చేయడం లేదు. కేవలం గేమ్ కోసమే తన తోటి కంటెస్టెంట్స్ తో స్నేహం చేస్తున్నట్టు నటిస్తుంది, ఇంత స్వార్థపూరితమైన కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎప్పుడూ చూడలేదని, నిన్న రాత్రి హాట్ స్టార్ లో బిగ్ బాస్ లైవ్ చూసిన ప్రతీ ఒక్కరికి అర్థం అవుతుంది. మొదటి నుండి నోటి దూలతో రెచ్చిపోయే అలవాటు ఉన్న ప్రేరణ, గత వారం మెగా చీఫ్ అయ్యాక ఆమె తన మాస్క్ ని పూర్తి గా తొలిగించి ఆడింది. ఆ మాస్క్ తొలగిన తర్వాత ఆమె నిజస్వరూపాన్ని చూసి ఆమెని అభిమానించే వారికి కూడా ఒకానొక సందర్భంలో చిరాకు కలిగింది. ఇష్టమొచ్చినట్టు నోరు జారడం, తోటి కంటెస్టెంట్స్ ని బానిసలు లాగా చూడడం, ఇలా ఒక్కటా రెండా, ఎంత నెగటివ్ అవ్వాలో అంత నెగటివ్ అయ్యింది. వీటిని మ్యానేజ్ చేయలేక ఆమె పీఆర్ టీం కి తల ప్రాణం తోకకి వచ్చినట్టు అయ్యింది.

అయితే నిన్న మరోసారి తన మాస్కుని తొలగించి ప్రేరణ తన గేమ్ ని మొత్తం డౌన్ చేసుకుంది అని చెప్పొచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న ఎలిమినేట్ అయిన అవినాష్ ని నబీల్ తన వద్ద ఉన్నటువంటి ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ ని ఉపయోగించి సేవ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అవినాష్ సేవ్ అయ్యినందుకు హౌస్ మేట్స్ మొత్తం ఎంతో సంతోషిస్తారు. కానీ ప్రేరణ మాత్రం ముఖం మాడ్చుకొని ఒక మూలాన కూర్చుంది. ఇదేంటి ఈమె అవినాష్ కి మంచి ఫ్రెండ్ కదా, సేవ్ అయితే సంతోషించాలి కానీ , ఎందుకు డల్ గా ఉంది అని మీ అందరికీ అనిపించి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత హాట్ స్టార్ లో లైవ్ చూసిన తర్వాత ప్రేరణ అలా నిరాశ చెందడానికి కారణం తెలిసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే వీకెండ్ ఎపిసోడ్ అయిపోగానే ప్రేరణ నబీల్ ని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది. నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, ఒట్టేసి చెప్పి అది ఎవరికీ చెప్పను అని అంటుంది. అప్పుడు నబీల్ అడుగు అని అంటాడు. ప్రేరణ మాట్లాడుతూ ‘అవినాష్ ని ఎందుకు అనవసరంగా సేవ్ చేసావ్..?, ఎలిమినేట్ అయ్యుంటే మనకి పోటీ తగ్గేది కదా..ఎందుకు నువ్వు ఇది ఆలోచించలేదు’ అని అంటుంది. దీనిని బట్టి ఇన్ని రోజులు ప్రేరణ అవినాష్, రోహిణి, తేజ వంటి వారితో స్నేహం చేసింది తనని నామినేషన్ చేయకుండా ఉండడం కోసమేనా?, అంటే ఈ లెక్కన ఆమె యష్మీ తో చేస్తున్నది కూడా ఫేక్ ఫ్రెండ్ షిప్ యేనా అని ఆడియన్స్ కి అనిపిస్తుంది. ఇది ఒక గేమర్ గా ప్రేరణ మాస్టర్ మైండ్ గేమ్ అని చెప్పొచ్చు కానీ, గేమ్ కోసం ఫేక్ ఎమోషన్స్ ని మ్యానేజ్ చేయడం మానవీయ కోణం లో చూస్తే తప్పే. ఇది కచ్చితంగా ఆమె గేమ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.