Bigg Boss Teugu 8: కమెడియన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే కేవలం కామెడీ మాత్రమే చేస్తారు, టాస్కులు ఆడలేరు, వాళ్లకి ఆడియన్స్ నుండి ఓట్లు పడవు అనేది చాలా మంది ప్రేక్షకుల అభిప్రాయం. స్వయంగా రోహిణి ఈ విషయాన్నీ టేస్టీ తేజతో ఒకరోజు అంటుంది. అయితే అదంతా నిజం కాదని, కమెడియన్స్ కూడా అద్భుతంగా ఆడగలరు అని, వాళ్లకి కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుందని నిరూపించిన కంటెస్టెంట్స్ అవినాష్, రోహిణి, టేస్టీ తేజ. అయితే బిగ్ బాస్ షోలో ఒక కంటెస్టెంట్ బాగా ఆడియన్స్ లోకి వెళ్లాలంటే కచ్చితంగా నామినేషన్స్ లోకి వస్తూ ఉండాలి. లేకపోతే ఆడియన్స్ తో కనెక్షన్ రాదు, ఫ్యాన్ బేస్ ఏర్పడదు. నేడు అవినాష్ కూడా అలాగే ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చింది. నామినేషన్స్ లోకి వచ్చిన ఆరు మందిలో నలుగురు సేవ్ అవ్వగా, చివరికి టేస్టీ తేజ, అవినాష్ మిగులుతారు.
వీళ్ళిద్దరిని నాగార్జున యాక్షన్ రూమ్ కి పిలిచి, తేజ, అవినాష్ పెయింటింగ్స్ మీద రంగు వేయాలని, ఎవరికైతే ఎరుపు రంగు వస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అని, ఎవరికైతే గ్రీన్ రంగు వస్తుందో వాళ్ళు సేఫ్ అని చెప్పి లైట్స్ ఆఫ్ చేసి పెయింట్ వేయమని చెప్తాడు నాగార్జున. అవినాష్ పెయింటింగ్ పై ఎరుపు రంగు రాగా, తేజ పెయింటింగ్ పై గ్రీన్ రంగు వస్తుంది. అయితే ఈ ప్రక్రియ జరిగే ముందే నాగార్జున నబీల్ తో మాట్లాడుతూ ‘నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది. దానిని ఈ వారం ఎవరికోసమైనా వాడుతావా? ‘ అని అడగగా, దానికి నబీల్ సమాధానం ఇస్తూ ‘ఈ ఎవిక్షన్ పాస్ నాకు రావడానికి అవినాష్ కూడా ఒక కారణం సార్. ఈ పాస్ ని నేను ఆయన కోసం ఉపయోగిస్తాను’ అని చెప్తాడు. ఈ విషయం యాక్షన్ రూమ్ లో ఉన్న అవినాష్, తేజ కి తెలియదు.
ఎప్పుడైతే ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందో, అప్పుడు నాగార్జున అవినాష్ కి నబీల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ని ఉపయోగించిన విషయాన్ని చెప్పి, నువ్వు సేవ్ అని అంటాడు. ఇక తేజ ఆడియన్స్ ఓట్ల ద్వారా సేవ్ అయ్యాడు కాబట్టి, అతను కూడా ఈ వారం నామినేషన్స్ నుండి సేఫ్. అలా ఈ వారం ఎలిమినేషన్ లేకుండా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఆ తర్వాత నాగార్జున అవినాష్ తో మాట్లాడుతూ ‘అందుకే నామినేషన్స్ లోకి వస్తూ ఉండాలి..ఇప్పుడు చూడు ఏమైందో’ అని అంటాడు. నన్ను ఎవ్వరూ నామినేట్ చేయడం లేదు సార్, అదే నా బాధ అని అంటాడు. ఈ వారం మెగా చీఫ్ అయ్యావు, ఈ వారం కూడా నామినేషన్స్ లో ఉండవు అని అంటాడు నాగార్జున. ఓపెన్ గా నాగార్జున ఉన్న విషయాన్ని చెప్పేసాడు. అవినాష్ ఇకనైనా నామినేషన్స్ లోకి వస్తాడో లేదో చూడాలి.