https://oktelugu.com/

Bigg Boss Telugu 8: టాస్కు అర్థం కాక ఒకరిపై ఒకరు నోరు పారేసుకున్న నబీల్, ప్రేరణ..చెప్పిన మాట మీద నిలబడకుండా అవినాష్ కి అన్యాయం!

పూర్తి వివరాల్లోకి వెళ్తే 'ఓట్ ఫర్ అప్పీల్' టాస్కులో భాగంగా, బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి 'క్రాసింగ్ పాత్స్' అనే టాస్కుని ఇస్తాడు. ఈ టాస్కులో రోప్స్ తో గందరగోళంగా ఉన్న పాత్స్ ని దాటుకుంటూ వెళ్లి ఎదురుగా ఉన్నటువంటి పోల్స్ కి ఒక క్రమపద్ధతిలో కట్టేయాలి.

Written By: , Updated On : December 5, 2024 / 09:24 AM IST
Bigg Boss Telugu 8(262)

Bigg Boss Telugu 8(262)

Follow us on

Bigg Boss Telugu 8: ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ‘ఓట్ ఫర్ అప్పీల్’ టాస్కులు మంచి ఫైర్ వాతావరణంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్స్ అందరూ చాలా ఫైర్ మీద టాస్కులు ఆడుతున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ప్రతీ ఒక్కరు తమ వైపు నుండి ది బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేసారు. నిన్న ఒక్క టాస్క్ లో ప్రేరణ గెలవగా, మరొక టాస్కులో నబీల్ గెలుస్తాడు. అయితే వీళ్లిద్దరికీ మొదటి టాస్కులో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవని చూసిన ఎవరికైనా వీళ్లిద్దరికీ అసలు టాస్క్ అర్థం కాలేదని తెలుస్తుంది. చివరికి ప్రేరణ అవినాష్ కి తీరని అన్యాయం చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ‘ఓట్ ఫర్ అప్పీల్’ టాస్కులో భాగంగా, బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ‘క్రాసింగ్ పాత్స్’ అనే టాస్కుని ఇస్తాడు. ఈ టాస్కులో రోప్స్ తో గందరగోళంగా ఉన్న పాత్స్ ని దాటుకుంటూ వెళ్లి ఎదురుగా ఉన్నటువంటి పోల్స్ కి ఒక క్రమపద్ధతిలో కట్టేయాలి.

ఈ టాస్క్ లో అందరి కంటే ముందుగా నబీల్ పూర్తి చేసి తన పోల్ కి రోప్ ని కట్టేస్తాడు. అందరికంటే ముందుగా కడుతాడు కానీ క్రమ పద్దతిలో చెయ్యలేదు, సరిగా చుట్టలేదని ప్రేరణ అంటుంది. హౌస్ మేట్స్ అందరికంటే బిగ్ బాస్ చెప్పిన రూల్ ప్రకారం, ప్రేరణ ఒక్కటే సరిగ్గా క్రమపద్ధతిలో పోల్ కి రోప్ ని చుడుతుంది. కానీ నబీల్ ఎలా చుట్టాము అనేది ముఖ్యం కాదు, చుట్టామా లేదా అనేది ముఖ్యం. నేనే అందరికంటే ముందు చుట్టాను. నా రోప్ నేలకు ముట్టుకోలేదు అని ప్రేరణ తో వాదిస్తాడు. చాలాసేపటి వరకు వీళ్లిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఎంతసేపు అయినా ఈ గొడవ తగ్గకపోవడంతో నేరుగా బిగ్ బాస్ కల్పించుకొని మాట్లాడాల్సి వస్తుంది. నబీల్ రూల్స్ ప్రకారం మీరు ఆడారని అనుకుంటున్నారా?, అసలు రోప్ ని పోల్ కి రోల్ చేయడం అనే దానికి అర్థం చెప్పండి అని అడుగుతాడు.

రూల్స్ ప్రకారం నబీల్ ఈ టాస్క్ లో గెలవలేదని ఆ తర్వాత అర్థం అవుతుంది. ఇక హౌస్ మేట్స్ అందరూ ఏకాభిప్రాయం ఎవరు రూల్స్ ప్రకారం రోప్ ని తమ పోల్స్ కి కట్టారో చెప్పండి అని అనగా, అందరూ ప్రేరణ పేరు చెప్తారు. అలా ఈ రౌండ్ లో ప్రేరణ గెలుస్తుంది. ప్రేరణ నెంబర్ 1 స్థానంలో ఉన్న కారణంగా బిగ్ బాస్ ఆమెకి చివరి స్థానంలో ఉన్నది ఎవరో చెప్పమని అంటుంది. నిఖిల్ తన పోల్ కి కాకుండా వేరే పోల్ కి కట్టి ముందుగా గంట కొడుతాడు. ఆ తర్వాత తప్పు చేసానని అర్థం చేసుకున్న నిఖిల్ తన పోల్ కి కట్టి అందరికంటే చివరగా బెల్ కొడుతాడు. ప్రేరణ ముందుగా నిఖిల్ పేరు చెప్తుంది. ఆ తర్వాత అయ్యోమయానికి గురై అవినాష్ పేరు చెప్తుంది. దీనికి అవినాష్ చాలా బాధపడతాడు.