Bigg Boss Telugu 8 : నేడే బిగ్ బాస్ తెలుగు 8… హౌస్ ఎలా డిజైన్ చేశారో తెలుసా? ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈసారి షో ఎలా ఉండబోతుంది? రూల్స్, రెగ్యులేషన్స్ ఏంటీ? ఎలిమినేషన్ ప్రాసెస్ ఏమిటి? హౌస్ ఎలా డిజైన్ చేశారు? అనే ఆసక్తి నెలకొని ఉంది. ఈ క్రమంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

Written By: S Reddy, Updated On : September 1, 2024 8:54 am

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ షో పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ వేరు. ఇది అత్యంత ఆదరణ పొందిన షో. బ్రిటన్ లో ప్రసారమైన బిగ్ బ్రదర్ షో దీనికి స్ఫూర్తి. 2006లో బిగ్ బ్రదర్ షోలో పాల్గొన్న హీరోయిన్ శిల్పా శెట్టి టైటిల్ గెలవడం విశేషం. అదే ఏడాది హిందీలో మొదటిసారి బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభించారు. ఫస్ట్ సీజన్ కి అర్షద్ వార్సి హోస్ట్ గా వ్యవహరించారు. హిందీలో బిగ్ బాస్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇతర ప్రాంతీయ భాషలకు పాకింది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో ఆరంభమైంది. మొదట్లో షో జనాలకు పెద్దగా ఎక్కలేదు. దానిలోని మజా తెలిశాక ప్రేక్షకులు అడిక్ట్ అయ్యారు. టాప్ రేటెడ్ షోగా బిగ్ బాస్ తెలుగు అవతరించింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. గత ఐదు సీజన్స్ కి నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. సీజన్ 8ని సైతం ఆయనే హోస్ట్ చేయనున్నారు.

బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఒక కామనర్ టైటిల్ కొట్టడం ఇదే ప్రథమం. సీజన్ 6 నిరాశపరిచిన నేపథ్యంలో సీజన్ 7 సరికొత్తగా రూపొందించి మేకర్స్ సక్సెస్ అయ్యారు. టాస్క్స్ , గేమ్స్ గతానికి భిన్నంగా రూపొందించారు. ఎలిమినేషన్ ప్రాసెస్ సైతం మార్చారు. గత సీజన్లో ఆకట్టుకున్న అంశాల్లో హౌస్ డిజైన్ కూడా ఒకటి.

హౌస్లో రెండు రకాల బెడ్ రూమ్స్ ఉండేవి. ఒకటి సాధారణ బెడ్ రూమ్, మరొకటి లగ్జరీ బెడ్ రూమ్. ఇది వీఐపీ బెడ్ రూమ్ అన్నమాట. ఈ వీఐపీ బెడ్ రూమ్ ని కెప్టెన్ మాత్రమే ఉపయోగించుకోగలడు. అలాగే కెప్టెన్ తనకు అసిస్టెంట్ గా ఒకరిని నియమించుకుంటారు. అసిస్టెంట్ కి కూడా ఎంట్రీ ఉంటుంది. మిగతా కంటెస్టెంట్స్ సాధారణ బెడ్ రూమ్ లో మాత్రమే పడుకోవాలి. వారికి వీఐపీ బెడ్ రూమ్ లోకి ప్రవేశం ఉండదు.

కాగా సీజన్ 8లో మూడు గదులు డిజైన్ చేశారట. ఒకటి గోల్డెన్ రూమ్ అట. అలాగే మరో రెండు గదులు ఉంటాయట. ఒక్కో గదికి ఒక్కో పేరు పెట్టారట. ఫస్ట్ బెడ్ రూమ్ పేరు తూనీగ అట. నెమలి, జీబ్రా మిగతా రెండు గదుల పేర్లు అట. గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా 16 మంది కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపుతున్నారట. మరో 5 మంది కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశ పెడతారట. ఈ మేరకు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.