https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘అశ్వథామ 2.0’ ట్రోల్స్ ని తల్చుకొని వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన గౌతమ్..క్షమాపణలు చెప్పిన అవినాష్!

బలంగా నిలబడే వ్యక్తి అంతలా ఏడ్చాదంటే బయట 'అశ్వద్ధామ 2.0' మీద ఏ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. హౌస్ లో అందరూ టార్గెట్ చేసినప్పుడు ఎదో ఎమోషనల్ గా చేశాను, దానిని బయట చాలా ట్రోల్ చేసారు, దానిని పట్టుకొని ఇలా జోక్స్ కోసం ఉపయోగించడం కరెక్ట్ కాదు అంటూ అవినాష్ కి చెప్తాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 10, 2024 / 08:03 AM IST

    Bigg Boss Telugu 8(100)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్న జరిగిన ఎపిసోడ్ లో హోటల్ టాస్క్ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది అనే చెప్పాలి. ఈ టాస్కు జరగడానికి ముందు బిగ్ బాస్ అమ్మాయిలను, అబ్బాయిలను వేరువేరుగా చేసి, అమ్మాయిల టీం కి అవినాష్ ని, అబ్బాయిల టీం కి రోహిణి ని లీడర్స్ గా చేస్తాడు బిగ్ బాస్. వీళ్ళు ఏమి చేయాలంటే నోట్లో నీళ్లు పోసుకొని అందరూ లైన్ లో నిల్చోవాలి. అవతలి టీం కి సంబంధించిన లీడర్ జోక్స్ వేసి వీళ్ళతో నవ్వించాలి. ఈ టాస్క్ లో ముందుగా అబ్బాయిల టీం లీడర్ రోహిణి అమ్మాయిలను నవ్వించే ప్రయత్నం చేస్తుంది. ఒక్కరు కూడా నవ్వకుండా చాలా కంట్రోల్ చేసుకుంటారు. ఇక ఆ తర్వాత అబ్బాయిలను నవ్వించేందుకు అవినాష్ దిగుతాడు. ముందుగా అవినాష్ మణికంఠ వద్దకు వెళ్లి ‘అఖిల బ్రహ్మాండ కోటి’ అంటూ అతన్ని ఇమిటేట్ చేస్తూ నవ్వించే ప్రయత్నం చేస్తాడు. మొదట్లో మణికంఠ నవ్వడు కానీ, ఆ తర్వాత అవినాష్ అపరిచితుడు లాగ వేరియేషన్ చూపిస్తూ ‘నీ అబ్బా రేయ్’ అనగానే నవ్వేస్తాడు మణికంఠ.

    ఆ తర్వాత గౌతమ్ ని నవ్వించే ప్రయత్నం లో ‘అశ్వద్దామా 2.0’ వచేసాడు అంటాడు. ఇక్కడే పూర్తిగా తేడా కొట్టేసింది. గౌతమ్ కి అవినాష్ అలా పిలిచినందుకు కోపం వస్తాది. ఎన్నిసార్లు చెప్పాలి బ్రో, ఇంతకు ముందు కూడా హౌస్ లోకి వచ్చినప్పుడు చాలా మంది అంటే, నేను అది కాదు వదిలేయండి అని చెప్పా, సీజన్ 7 లోనే ఆ చాప్టర్ క్లోజ్ అయ్యింది, నాగార్జున సార్ అన్నప్పుడు కూడా నేను అది కాదు సార్ సోలో బాయ్ అని చెప్పాను, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది అని కోపం తో మైక్ విసిరి కొట్టి లోపలకు వెళ్ళిపోతాడు. గౌతమ్ కి సీజన్ 7 లో ఇంతకంటే దారుణమైన పరిస్థితులు వచ్చాయి , అలా వచ్చినప్పుడల్లా ధైర్యం ఎదురుకొని సమాధానం చెప్పేవాడు గౌతమ్, ఏరోజు కూడా ఆయన ఎమోషనల్ అయ్యి ఏడ్చింది చూడలేదు. కానీ ఈరోజు ఆయన ఏడవడం చూసి ప్రతీ ఒక్కరు షాక్ కి గురయ్యారు. ఏంటి గౌతమ్ కి కూడా ఏడుపు వస్తుందా అని ఆయన అభిమానులు ఆశ్చర్యపోయారు.

    అంత బలంగా నిలబడే వ్యక్తి అంతలా ఏడ్చాదంటే బయట ‘అశ్వద్ధామ 2.0’ మీద ఏ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. హౌస్ లో అందరూ టార్గెట్ చేసినప్పుడు ఎదో ఎమోషనల్ గా చేశాను, దానిని బయట చాలా ట్రోల్ చేసారు, దానిని పట్టుకొని ఇలా జోక్స్ కోసం ఉపయోగించడం కరెక్ట్ కాదు అంటూ అవినాష్ కి చెప్తాడు. అప్పుడు అవినాష్ గౌతమ్ కి క్షమాపణలు చెప్తాడు. గౌతమ్ కూడా ‘ఎదో ట్రిగ్గర్ అయ్యాను..మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా బాధపెట్టే ఉద్దేశ్యం లేదు’ అని అవినాష్ కి క్షమాపణలు. ఈ ఘటన అయిపోయిన తర్వాత కూడా గౌతమ్ వాష్ రూమ్ కి వెళ్లి తలచుకొని ఏడుస్తున్నదంటే పాపం అతను ఆ ట్రోల్స్ కి ఎంత బాధ పడ్డాడో అని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో పోస్టులు వేస్తున్నారు.