Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హిస్టరీ లోనే ఒక వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గ్రాఫ్ టైటిల్ రేస్ కొట్టే రేంజ్ కి పెరగడం ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు. కానీ ఈ సీజన్ లో గౌతమ్ విషయంలో అది జరగబోతుంది. మొదటి వారం నామినేషన్స్ లోకి వచ్చినప్పుడే ఎలిమినేట్ అయిన గౌతమ్, మణికంఠ వల్ల సేవ్ అయ్యాడు. ఆ తర్వాత ఆయన తన ఆట తీరుని పూర్తిగా మార్చుకొని, అనవసరమైన విషయాల జోలికి పోకుండా, అద్భుతంగా టాస్కులు ఆడుతూ, సోలో గా ముందుకు దూసుకుపోతూ, నేడు టైటిల్ విన్నింగ్ రేస్ లోకి దూసుకొచ్చాడు. కచ్చితంగా ఈ సీజన్ గౌతమ్ బిగ్ బాస్ జర్నీ ప్రతీ రాబోయే సీజన్స్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఒక పాఠం లాంటిది. ఈ వారం హౌస్ లో ఉన్న 9 మందిలో 8 మంది నామినేషన్స్ లోకి వచ్చారు. ఆ 8 మందిలో గౌతమ్ కి పడినన్ని ఓట్లు మిగిలిన ఏ కంటెస్టెంట్ కి కూడా పడలేదు.
గౌతమ్ కి ఏకంగా 32 శాతం ఓట్లు నమోదై నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుండగా, నిఖిల్ 15 శాతం ఓట్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి రెండు స్థానాలకు ఏ రేంజ్ తేడా ఉందో మీరే చూడండి. ఇక గత వారం నిఖిల్ ని భారీ మార్జిన్ తో అధిగమించి నెంబర్ 1 స్థానంలో కొనసాగిన నబీల్, ఇప్పుడు 11 శాతం ఓటింగ్ తో మూడవ స్థానంలో ఉన్నాడు. గత వారం గౌతమ్ నామినేషన్స్ లో లేడు కాబట్టి అతని ఫ్యాన్స్ మొత్తం నబీల్ కి ఓటు వేశారు. అందుకే ఆయనకీ గత వారం నిఖిల్ మీద అంతటి భారీ మార్జిన్ వచ్చింది. అలాంటి నబీల్, ఈ వారం గౌతమ్ ని సిల్లీ పాయింట్స్ తో నామినేట్ చేయడం గమనార్హం. ఇక నాల్గవ స్థానంలో అవినాష్ కొనసాగుతున్నాడు.
నిన్న జరిగిన నామినేషన్స్ ప్రక్రియ లో అవినాష్ ని పృథ్వీ చాలా తక్కువ చేసి మాట్లాడుతాడు. అందుకే ఆడియన్స్ అవినాష్ కి ఈ వారం భారీ ఓటింగ్ వేయాలని ఫిక్స్ అయ్యారు. దానికి తోడు రోహిణి నామినేషన్స్ లో లేకపోవడం కూడా అవినాష్ కి బాగా కలిసొచ్చింది. అలాగే 5 స్థానం లో విష్ణు ప్రియ, ఆరవ స్థానం లో పృథ్వీ రాజ్ కొనసాగుతుండగా, చివరి రెండు స్థానాల్లో ప్రేరణ, టేస్టీ తేజా కొనసాగుతున్నారు. టాప్ 5 లో ఉంటుంది అనుకున్న ప్రేరణ గ్రాఫ్ ఈ రేంజ్ లో పడిపోయిందని నిన్న ఓటింగ్ పోల్స్ చూస్తేనే అర్థమైంది. అయితే ఓటింగ్ గ్రాఫ్ ఇలాగే కొనసాగదు. కచ్చితంగా మారుతుంది. గౌతమ్, నిఖిల్, నబీల్ తప్ప మిగిలిన కంటెస్టెంట్స్ అందరికీ దాదాపుగా సమానమైన ఓట్లు వచ్చాయి. ఏ క్షణంలో అయినా గ్రాఫ్ మారొచ్చు. ప్రస్తుతానికి అయితే డేంజర్ జోన్ లో ప్రేరణ, తేజ ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్లిద్దరు ఎలిమినేట్ అవ్వొచ్చు.