Bigg Boss Telugu 8: ఈ సీజన్ లో ఎందుకో పాత కంటెస్టెంట్స్(ఓజీ టీం) మొత్తం వైల్డ్ కార్డ్స్ మీద పీకల దాకా పగ పెంచేసుకున్నారు. ముఖ్యంగా గౌతమ్ ఎదుగుదల ని నిఖిల్, ప్రేరణ,నబీల్, పృథ్వీ, యష్మీ వంటి వారు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. నామినేషన్స్ లోకి వచ్చిన మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లిపోవాల్సిన గౌతమ్, కేవలం మణికంఠ కారణంగా సేవ్ అయ్యి, ఇప్పుడు మన అందరి విన్నింగ్ అవకాశాలను పక్కకి నెట్టి, అతను టైటిల్ రేస్ లోకి రావడం ఏమిటి?, ఎక్కడ తప్పు జరిగింది?, మన కుటుంబ సభ్యులు, ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయిన సభ్యులు, ప్రతీ ఒక్కరు కూడా గౌతమ్ ఆట తీరు అద్భుతంగా ఉంది అని అంటున్నారే, ఎలా?, అసలు అతనికి ఇంత సపోర్టు ఎలా వచ్చింది అని వీళ్ళందరూ జుట్టు పీక్కుంటున్నారు. ఆ అక్కసు తోనే నిన్న హౌస్ లో 9 మంది ఉంటే, 6 మంది గౌతమ్ కి నామినేషన్స్ వేశారు.
ప్రతీ ఒక్కరితో గౌతమ్ డిఫెండ్ చేసుకున్న తీరు వేరే లెవెల్ అని చెప్పాలి. నిన్నటి ఎపిసోడ్ తో గౌతమ్ కి టైటిల్ ఖరారు అయిపోయింది. అలా చేసారు కంటెస్టెంట్స్. గౌతమ్ లో ఏముంది అని అలా కుళ్ళుకుంటున్న హౌస్ మేట్స్ కి తెలియాల్సింది ఒక్కటే..గౌతమ్ అన్యాయంగా ఎవరి గురించి మిగిలిన కంటెస్టెంట్స్ లాగా వెనుక చేరి మాట్లాడడు. అదే విధంగా గ్రూప్ గేమ్స్ ఆడుతూ ఒక్కరినే టార్గెట్ చేయడం వంటి అన్యాయమైన కార్యక్రమాలు చేయడు. నబీల్ లాగా గేమ్స్ విషయం డీలింగ్స్ పెట్టుకొని ఆడడు. తనకి నచ్చిన విధంగా, మనసుకి ఏది అనిపిస్తే అది చేస్తూ ముందుకు పోతున్నాడు. ఆడియన్స్ కి గౌతమ్ లో నచ్చిన విషయం అదే. మిగిలిన కంటెస్టెంట్స్ లాగానే గౌతమ్ కూడా టాస్కులు ఆడాడు, కానీ అతనిలోని స్పెషల్ ఇదే. ముఖ్యంగా గౌతమ్ అంటే అసూయతో ప్రేరణ, నబీల్ రగిలిపోతున్నారు.
ప్రేరణ అయితే ఆమె బలుపు యాటిట్యూడ్ తో నిన్న మాట్లాడిన మాటలు చాలా అన్యాయంగా అనిపించింది. గౌతమ్ పై వ్యక్తిగతంగా ఎన్నో కామెంట్స్ చేసింది, అదే విధంగా సీతాఫలం విషయంలో తనని చెడుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేసావు అని చెప్పింది. దానికి గౌతమ్ ఫీల్ అయ్యి నేను అది కావాలని చేయలేదు, కేవలం ఫన్ కోసమే చేశాను, కావాలంటే నీ కాళ్ళు పట్టుకొని చెప్పమంటావా చెప్పు అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతాడు గౌతమ్. నేను మామూలుగా మాట్లాడిన తప్పే, అరిచి మాట్లాడినా తప్పే, ఫన్ చేసినా తప్పే, ఏమి చేసిన తప్పే. అందుకే నేను ఇక్కడ ఎవ్వరితో రిలేషన్ పెట్టుకోలేదు, అందరితో కట్ చేసుకున్నాను అని బాధతో మాట్లాడుతాడు గౌతమ్. అది కూడా ప్రేరణ వంటి వారు స్ట్రాటజీ అని అనుకుంటున్నారంటే ఇక వాళ్ళని ఏమని అనుకోవాలో ఆడియన్స్ ఆలోచించుకోవాలి. నబీల్ కూడా అవకాశం చూసి నిన్న నామినేషన్స్ లో గౌతమ్ ని ఎమోషనల్ గా కొట్టాడు.