https://oktelugu.com/

Bigg Boss Telugu 8: గంగవ్వ దెబ్బకి హౌస్ మొత్తం హడల్..బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలాంటి చెత్త పని ఎవ్వరూ చేసుండరు!

నిన్నటి ఎపిసోడ్ చివర్లో వేసిన ప్రోమోలో గంగవ్వ తనకి దెయ్యం పట్టినట్టుగా హాల్ లోపలకు వచ్చి పెద్ద పెద్దగా అరుస్తుంది. పూనకాలు వచ్చినట్టు ఊగిపోతోంది. హౌస్ మేట్స్ అందరూ పాపం మంచి నిద్రలో ఉన్నారు. గంగవ్వ అలా అరిచేసరికి భయపడి హాల్ లోకి వచ్చారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 23, 2024 / 08:25 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో మొత్తం బోరింగ్ కంటెంట్ రావడంతో కంటెస్టెంట్స్ ఎంటర్టైన్మెంట్ పంచేందుకు ఏమి చేయాలో అర్థం కావడంలేదు. ఎదో చేయాలనీ ప్రయత్నం చేసి, సున్నితమైన అంశాలను కూడా కామెడీ అయ్యేలా చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ చివర్లో వేసిన ప్రోమోలో గంగవ్వ తనకి దెయ్యం పట్టినట్టుగా హాల్ లోపలకు వచ్చి పెద్ద పెద్దగా అరుస్తుంది. పూనకాలు వచ్చినట్టు ఊగిపోతోంది. హౌస్ మేట్స్ అందరూ పాపం మంచి నిద్రలో ఉన్నారు. గంగవ్వ అలా అరిచేసరికి భయపడి హాల్ లోకి వచ్చారు. ఆమెను కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నం చేసారు. కానీ ఆమె మాత్రం అసలు తగ్గడం లేదు. అకస్మాత్తుగా ఆమెకు ఏమైంది అని అందరూ అయ్యోమయ్యం లో పడ్డారు. అయితే ఇదంతా నిజం కాదు, ప్రాంక్.

    ఈ ప్రాంక్ ఆలోచన ఇచ్చింది టేస్టీ తేజా, అవినాష్. ఇక గంగవ్వ అయితే వాళ్ళు ఇచ్చిన స్కిట్ ని తూచా తప్పకుండ అనుసరించి జీవించేసింది. అవినాష్, టేస్టీ తేజా ఇద్దరికీ 30 ఏళ్ళ వయస్సు దాటి ఉంటుంది. కానీ వీళ్లిద్దరికీ బుర్ర లేదు అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎలాంటి అంశాల మీద ప్రాంక్ చేయాలి, కామెడీ చేయాలి అనే ఇంకిత జ్ఞానం వీళ్లిద్దరికీ లేదు. గంగవ్వ పెద్దావిడ, ఆమెకు అక్కడి వాతావరణం సరిపడక బిగ్ బాస్ సీజన్ 4 లో మధ్యలోనే వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అప్పుడు ఒకసారి వచ్చింది కాబట్టి, ఈసారి కూడా ఆమెకు అలాంటి సమస్యలు రావొచ్చు. పల్లెటూరు వాతావరణం కి అలవాటు పడిన శరీరం, 24 గంటలు ఒకే ఏసీ ఇంట్లో ఉండడం అంత తేలికైన విషయం కాదు. ఎదో ఒకరోజు ఆమెకు నిజంగానే ఆరోగ్యం పాడు అవ్వొచ్చు.

    ఇప్పుడు ఆమె చేసిన ప్రాంక్ ని హౌస్ మేట్స్ గుర్తుకు తెచ్చుకొని, ఈమె మళ్ళీ ప్రాంక్ చేసిందని భావించి ఎవ్వరూ పట్టించుకోకపోతే పరిస్థితి ఏమిటి?, ఆమె ప్రాణాలకే ప్రమాదం కదా?, ఇలాంటి విషయాల్లో ప్రాంక్ చెయ్యొచ్చా? అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో అవినాష్, టేస్టీ తేజా పై మండిపడుతున్నారు. ఇది కచ్చితంగా ఫన్నీ అయితే కాదు, నేడు ఇది ప్రాంక్ అని తెలుసుకున్నాక హౌస్ మేట్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. కచ్చితంగా వీళ్లిద్దరి పై హౌస్ మేట్స్ అందరూ వచ్చే వారం నామినేషన్స్ వేయొచ్చు. వాళ్ళకంటే బుద్ధి లేదు, 60 ఏళ్ళ వయస్సు దాటిన నీకు కూడా తెలియదా అవ్వా ?, ఎలాంటి విషయాల్లో కామెడీ చేయాలి అని అంటూ గంగవ్వ మీద కూడా నామినేషన్స్ వెయ్యొచ్చు. వచ్చే వారం కచ్చితంగా ఈ ముగ్గురు నామినేషన్స్ లోకి రావడం పక్కా అనేది ఇప్పుడే ఫిక్స్ అయిపోవచ్చు. ఈ అంశం పై వీకెండ్ లో నాగార్జున అవినాష్, తేజా కి బాగా క్లాస్ పీకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి రేపటి ఎపిసోడ్ లో ఈ స్కిట్ పై హౌస్ మేట్స్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది.