Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: నా టీ షర్ట్ చింపకండి..ఎలిమినేట్ అయిపోతా అంటూ ...

Bigg Boss Telugu 8: నా టీ షర్ట్ చింపకండి..ఎలిమినేట్ అయిపోతా అంటూ బిగ్ బాస్ ని కాళ్ళ వేళ్ళా పట్టుకొని బ్రతిమిలాడుకున్న అవినాష్!

Bigg Boss Telugu 8: అవినాష్ లేని బిగ్ బాస్ సీజన్ 8 ని అసలు ఊహించుకోలేం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఈ సీజన్ టీఆర్ఫీ రేటింగ్స్ ని కాపాడింది మాత్రం వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్, వారిలో అవినాష్ పాత్ర ఎంతో కీలకం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అందించిన ఎంటర్టైన్మెంట్ కి తిరుగులేదు. ఆయన కామెడీ చెయ్యాలనుకున్న ప్రతీ సందర్భం వర్కౌట్ అయ్యింది. 90 శాతం జోకులు బాగా క్లిక్ అయ్యాయి. కేవలం కామెడీ మాత్రమే చేసాడు అనుకుంటే పొరపాటే. టాస్కులు కూడా ఆయన చాలా అద్భుతంగా ఆడాడు. రెండు సార్లు కూడా ఆయన తన సొంత కష్టం మీదనే గేమ్స్ ఆది మెగా చీఫ్ అయ్యాడు. కొన్ని సందర్భాలలో ఆయన నిఖిల్ , పృథ్వీ లాంటి తోపు కంటెస్టెంట్స్ తో పోటీ పది కూడా ఆడాడు. ఈ సీజన్ బిగ్ బాస్ సక్సెస్ అయ్యింది అంటే అందులో అవినాష్ పాత్ర చాలా ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే ఇంత బాగా ఆడుతున్నప్పటికీ కూడా అవినాష్ కి ఆడియన్స్ నుండి కావాల్సిన సరైన సపోర్టు దొరకడం లేదనే చెప్పాలి. గత వారం ఆయన నామినేషన్స్ లోకి వచ్చి ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నబీల్ తన దగ్గరున్న ఏవిక్షన్ షీల్డ్ ని ఉపయోగించడం వల్లే అవినాష్ సేవ్ అయ్యాడు. సీజన్ 4 లో కూడా ఏవిక్షన్ షీల్డ్ వల్లే అవినాష్ సేవ్ అవుతాడు. అయితే అవినాష్ కి ఆడియన్స్ సపోర్ట్ లేకపోవడానికి ప్రధాన కారణం ఆయన నామినేషన్స్ లోకి రాకపోవడమే. హౌస్ మేట్స్ అందరితో ఆయన చాలా స్నేహంగా ఉంటాడు కాబట్టి ఎవ్వరూ అతన్ని నామినేట్ చేయడానికి ఇష్టపడరు . ఇది ఆయనకీ శాపం లాగా మారింది. ఎప్పుడైనా నామినేషన్ లోకి పొరపాటున వస్తే ఎలిమినట్ అయ్యే పరిస్థితి వస్తుంది.

గత వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున కూడా ఇదే అంటాడు. ‘అందుకే అప్పుడప్పుడు నామినేషన్స్ లోకి రావాలి’ అని అవినాష్ కి డైరెక్ట్ గా చెప్తాడు నాగార్జున. కానీ అవినాష్ ఇప్పటికీ కూడా నామినేషన్స్ లోకి రావడానికి భయపడుతున్నాడు. నిన్న మెగా చీఫ్ టాస్క్ లో తన టీ షర్ట్ లోపలకి వెయ్యకండి బిగ్ బాస్ అని బ్రతిమిలాడుకుంటాడు. తన టీ షర్ట్ లోపలకు వేస్తే చింపేస్తారు. దాని వల్ల నేను మెగా చీఫ్ కంటెండర్ ని అవ్వలేను, ఎలిమినేట్ అయిపోతాను. ఎదో ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల సేఫ్ అయ్యాను కానీ, లేకపోతే ఈపాటికి ఇంట్లో ఉండేవాడిని. ఇప్పటికే నేను ఎలిమినేట్ అయ్యాను అని ఇంట్లో ఇద్దరు వెక్కిరిస్తున్నారు అంటూ అవినాష్ చాలా ఫన్నీ గా బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ అవినాష్ కి ఇప్పుడు ఓటింగ్ బాగానే పెరిగింది. ఆయన టాప్ 5 లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి వచ్చే వారం ఆయన అదృష్టం ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper
Exit mobile version