Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లో రోజుకో ట్విస్టు కంటెస్టెంట్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేంత పని చేస్తుంది. ఈ సీజన్ లో రేషన్ ఉండదు అని బిగ్ బాస్ ఇప్పటికే చెప్పిన సంగతి మన అందరికీ తెలిసిందే. కానీ నిన్న మొన్నటి వరకు రేషన్ విషయం లో ఎలాంటి లిమిట్స్ పెట్టలేదు. కానీ ఈరోజు జరిగే ఎపిసోడ్ లో బిగ్ బాస్ రేషన్ మొత్తం లాగేసుకున్నాడు. ఎవరు ఎంత తినాలని అనుకుంటున్నారో, అంత తినేసి రేషన్ ని స్టోర్ రూమ్ లో పెట్టండి అంటూ ఆదేశాలు జారీ చేసాడు బిగ్ బాస్. నేడు విడుదల చేసిన మూడవ ప్రోమో లో యష్మీ టీం దొంగతనాలు ప్రారంభించారు. ముందుగా టీ పౌడర్, షుగర్ ని నొక్కేస్తారు. అప్పుడు మణికంఠ నిఖిల్ తో మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రూట్ జ్యూస్ బాటిల్స్ దోచేద్దాం అని అంటాడు. అప్పుడే నబీల్ అక్కడికి చేరుకొని వాళ్ళు నా చికెన్ దొబ్బేసారు, నేను కూడా దొంగిలిస్తాను అని నిఖిల్, మణికంఠ తో చెప్తాడు.
అప్పుడు ఎవరయితే నా చికెన్ దొంగలించారో ఈరోజు వాళ్లకు తిరగకూడదు దేవుడా అంటూ సోనియా అంటుంది. అలా కంటెస్టెంట్స్ ఎవరి వస్తువులను వారు దొంగలింపబడకుండా కాపాడుకుంటూ ఉన్నారు. ఇక నాగ మణికంఠ నైనికా తో మాట్లాడుతూ రెండు రోజులైంది కడుపునిండా అన్నం తిని అంటాడు. అప్పుడు పక్కనే నిఖిల్ మాట్లాడుతూ ‘నా జీవం తింటున్నావ్ కదరా, 5 కిలోలు తగ్గాను, నా రక్తం తాగుతున్నావ్ కూర్చొని’ అని అంటాడు. అప్పుడు మణికంఠ ‘నాకు నీరసం గా ఉంది. నా మొహం మీద ఎవరైనా ఆరంజ్ జ్యూస్ చల్లండి అని అంటాడు. అలా ప్రోమో మొత్తం ఫన్నీ గా సాగిపోయింది. ముందు విడుదల చేసిన రెండు ప్రోమోలలో యష్మీ వ్యాఖ్యాతగా వ్యవహరించి నాగ మణికంఠ తో ఒక విషయం లో గొడవ పడుతుంది. బిగ్ బాస్ జంతికలు 250 గ్రాములు తీసుకొని రావాల్సిందిగా మణికంఠ మరియు సీతకు చెప్తాడు. ఇద్దరు తెస్తారు, కానీ దానిని కొలుస్తున్న సమయం లో యష్మీ ఇద్దరు 250 గ్రాములు తీసుకొని రాలేదు, కాబట్టి పాయింట్స్ లేవు అంటుంది.
అప్పుడు మణికంఠ తెచ్చిన వారిలో ఎవరిదైతే 250 గ్రాములకు దగ్గరగా ఉంటుందో వాళ్లకి పాయింట్స్ ఇవ్వు అంటాడు. అలా నేను ఇవ్వను, నేను సంచాలక్ ని నా నిర్ణయం ఫైనల్ అని అంటుంది యష్మీ. ఈ విషయం లో ఎన్ని వాదనలు చేసినా ఆమె అసలు తగ్గడం లేదు. అసలు ఆమె కంటెస్టెంట్స్ మొత్తం తన శత్రువులు అన్నట్టుగా ప్రవర్తిస్తుంది. ఈ సీజన్ బిగ్ బాస్ మొత్తం ట్విస్టులతో ఉంటుంది అని నాగార్జున ఇది వరకే అనేక సార్లు చెప్పాడు. అందులో భాగంగా ఎలిమినేషన్ హౌస్ మేట్స్ చేతిలో ఎదో ఒకరోజు పెడితే యష్మీ పరిస్థితి ఏమిటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.