Bigg Boss Telugu 8 : ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి మెగా చీఫ్ అయిన ప్రేరణ బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకుంది. ఒక విధంగా చెప్పాలంటే మెగా చీఫ్ అవ్వడం ఆమెకి పెద్ద శాపం లాగ తయారైంది. మొదటి నుండి నోటి దూల లక్షణం ఉన్న ప్రేరణ, మెగా చీఫ్ అయ్యాక సీజన్ మొత్తం మీద ఎన్ని సార్లు నోరు జారిందో, ఈ ఒక్క సీజన్ లో అన్ని సార్లు నోరు జారింది. ఆమె గ్రాఫ్ కూడా అమాంతం పడిపోయింది. టైటిల్ రేస్ లో ఉన్న ఆమె, ఇప్పుడు టాప్ 5 లో అయినా ఉంటుందా అంటే అనుమానమే. ఎందుకంటే టేస్టీ తేజ స్థానం టాప్ 5 లో ఫిక్స్ అయిపోయింది. ఇది ప్రేరణ పై బలమైన ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఒక భారీ పాజిటివ్ ఎపిసోడ్ పడితే ప్రేరణ మళ్ళీ రేస్ లోకి రావొచ్చు. అయితే ఆమె ఆ అవకాశం ఆడియన్స్ కి ఇచ్చేలా అనిపించడం లేదు. ఈమెతో ఇటీవల కాలం స్నేహం గా ఉంటున్న టేస్టీ తేజ పై కూడా అనేకసార్లు నోరు జారింది. నిన్నటి ఎపిసోడ్ లో రాత్రి జరిగింది చూపించలేదు కానీ, తేజ తో చాలా పొగరుగా వ్యవహరించింది ప్రేరణ.
కిచెన్ ఫ్లోర్ ని క్లీన్ చేసే బాధ్యతలు ఆమె అవినాష్ కి ఇచ్చింది. రాత్రి సమయంలో ఫ్లోర్ శుభ్రంగా లేకపోవడంతో అప్పుడే అక్కడికి వచ్చిన తేజకి అవినాష్ ని పిలువు అని అంటుంది ప్రేరణ. అప్పుడు తేజ అవినాష్ అన్నతో ఇప్పుడే దీని గురించి మాట్లాడాను, ఆయన రేపు ఉదయం చేస్తానని చెప్పాడు, నువ్వు పిలిచినా అదే చెప్తాడు అని అంటాడు. అప్పుడు ప్రేరణ కోపం గా ముందు నువ్వు అవినాష్ ని పిలువు అని అంటుంది. దానికి తేజ కి చాలా కోపం వస్తుంది. నేనేమి నీ అసిస్టెంట్ కి కాదు, నీకు పిలవాలని ఉంటే వెళ్లి పిలుచుకో అని అంటాడు. ఇలా మొదటి నుండి ప్రేరణతో స్నేహంగా ఉంటూ అతని పై నోరు జారడంతో అతను కూడా ఈమెకి నెగటివ్ అయిపోయాడు. చివరికి ఫన్ టాస్క్ జరిగే ముందు, అవినాష్ కారణంగా థెర్మో కోల్ బాల్స్ క్రిందకి పడిపోయి రూమ్ మొత్తం చెత్తచెత్తగా అయిపోతుంది. అప్పుడు ప్రేరణ కోపంతో డస్ట్ బిన్ లో పడేయొచ్చు కదా, వరస్ట్ ఫెల్లో అని అవినాష్ ని తిడుతుంది.
అవినాష్ ఫీల్ అయ్యి హాల్ లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రేరణ రూమ్ ని శుభ్రం చేస్తుండగా రోహిణి ఫన్నీ టాస్క్ చేయడానికి పిలుస్తుంది. అప్పుడు ప్రేరణ రోహిణి పై చిరాకు పడుతూ ‘నీ అమ్మ’ అని తిట్టుకుంటూ హాల్ లోకి వెళ్తుంది. ప్రేరణతో ఉన్న చిరాకుని గమనించిన అవినాష్, ఆమెతో మాట్లాడుతూ ‘ప్రేరణ నువ్వు నా మనసుని చాలా గాయపరుస్తున్నావ్. ఇలా అయితే నేను టాస్కులు చెయ్యలేను. ఇందాక కూడా ఇలాగే చేసావు. నువ్వు నన్ను వరస్ట్ ఫెల్లో అని అన్నావు, నీకు ఆ విషయం గుర్తుందా అసలు?, ఎందుకు నీకు అంత కోపం, అవసరమా..ఇలా ఉంటే నా మూడ్ కరాబ్ అవుతుంది..నేను టాస్క్ చేయలేను’ అని అంటాడు. దానికి ప్రేరణ క్షమాపణలు చెప్తుంది. ఇలా నోరుని ఆమె అదుపులో పెట్టుకోకుండా ఇష్టమొచ్చినట్టు వాడేస్తుంది. ఈ పద్దతి మార్చుకోకుంటే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుంది.