Bigg Boss Telugu 8 : ఈ సీజన్ లో బాగా హైలైట్ అయిన అంశాలలో ఒకటి విష్ణు ప్రియ , పృథ్వీ లవ్ ట్రాక్. ఈ ట్రాక్ రెండు వైపుల నుండి లేదు, కేవలం విష్ణుప్రియ వైపు నుండి మాత్రమే ఉంది. పృథ్వీ నాకు నీ మీద ఆసక్తి లేదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా విష్ణు ప్రియ అతని వెంటనే తిరుగుతూ ఉన్నింది. అతని ఆనందమే ఈమె ఆనందం, అతని బాధనే ఈమె బాధ అన్నట్టుగా మొదటి వారం నుండి నేటి వరకు విష్ణుప్రియ బిగ్ బాస్ ప్రయాణం సాగింది. ఒక అమ్మాయి అబ్బాయి వెంట ఈ రేంజ్ లో తిరగడం అనేది బిగ్ బాస్ హిస్టరీ లోనే కాదు, సినిమాల్లో కూడా మనం ఎప్పుడూ చూడలేదు. కంటెంట్ కోసం విష్ణుప్రియ డ్రామాలు చేస్తుందా అంటే అది కూడా లేదు, ఆమెది నిజాయితీ గల ప్రేమ అని ఆడియన్స్ కి కూడా అర్థం అయ్యింది కాబట్టే ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఆమెని సేవ్ చేస్తూ వచ్చారు.
అయితే ఈమెకు తన పద్దతి మార్చుకోమని, పృథ్వీ కోసం కాకుండా, నీ కోసం గేమ్ ఆడుకో అంటూ విష్ణుప్రియ తన తండ్రితో పాటు, తన స్నేహితుడు యాంకర్ రవి, తన చెల్లి చెప్పింది. కానీ ఆమె వినలేదు, నేను ఈరోజు గేమ్ ఇలా ఆడుతున్నాను అంటే, అతను ఈ హౌస్ లో ఉన్నాడు అనే కారణంతోనే అని చెప్పుకొచ్చింది. ఈమె మొండిగా మాట్లాడే మాటలను చూసి వాళ్లకు కూడా చిరాకు కలిగింది. అదే విధంగా హౌస్ లోకి అడుగుపెట్టిన అతిథులు కూడా విష్ణు ప్రియ కి అర్థం అయ్యేలా చెప్పారు. కానీ ఆమె వినలేదు. నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి ‘టికెట్ టు ఫినాలే’ చివరి టాస్కుని నిర్వహించడానికి వచ్చిన శ్రీముఖి కూడా ఈమెకు కూర్చోబెట్టి అర్థం అయ్యేలా చెప్పింది.
ఎందుకు ఈమె ప్రయత్నం విష్ణు ఈమె మాట కూడా వినదు అని అందరూ అనుకున్నారు కానీ, విష్ణు ఆమె మాట వినింది. విన్న తర్వాత పృథ్వీ వద్దకు వెళ్లి హౌస్ లో మిగిలిన ఈ రెండు వారాలు నా స్నేహాన్ని పక్కన పెట్టి, నా గురించి ఆలోచించుకొని ఆడుతాను అని పృథ్వీ కి చెప్తుంది. దానికి పృథ్వీ నేనేమైనా నాకోసం నీ గేమ్ చెడగొట్టుకోమని చెప్పానా?, నా వెనుక తిరగమని అన్నానా? , నాకు ఎందుకు చెప్తున్నావ్, ఇకనుండి అయినా నా గురించి ఆలోచించడం ఆపి నీ గేమ్ నువ్వు ఆడుకో అని అంటాడు పృథ్వీ. ఇంతకీ విష్ణు ఈ రేంజ్ లో మారిపోయేంతగా శ్రీముఖి ఏమి చెప్పిందంటే ‘మొదటి రెండు వారాలు నీ ఆట చూసినప్పుడు, పర్వాలేదు ఆడేస్తుంది, టైటిల్ కొట్టేస్తుంది అని అనుకున్నాను. కానీ మధ్యలో నీకు అతనితో రిలేషన్ ఏర్పడింది. అది ప్రేమ అని నేను అనను, స్నేహం అనే అంటాను. ఏదిఏమైనా నా కోసం ఈ రెండు వారాలు అవన్నీ పక్కన పెట్టి ఆడు’ అని అంటుంది. ఈ మాటలకే విష్ణు ప్రియ మారిపోవడం ఆమె అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.