Bigg Boss Telugu 8: గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి మెహబూబ్ ఎలిమినేట్ అవ్వగా, ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు యష్మీ, గౌతమ్, హరి తేజ, నయనీ పావని, టేస్టీ తేజ నామినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా హీట్ వాతావరణంలో జరిగిన ఈ వారం నామినేషన్స్ ప్రక్రియలో ఎన్నో ట్విస్టుల తర్వాత చివరికి ఈ 5 మంది నామినేషన్స్ లోకి వచ్చారు. వీరిలో అత్యధిక శాతం మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ అవ్వడం గమనార్హం. కేవలం యష్మీ ఒక్కటే ఓజీ క్లాన్ నుండి నామినేషన్స్ లోకి వచ్చింది. అయితే ఓటింగ్ సరళి మాత్రం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంది. రోజురోజుకి నామినేషన్స్ లోకి వచ్చిన 5 మంది గ్రాఫ్ మారిపోతూ ఉంది. అందరూ ఊహించినట్టుగానే యష్మీ కి ప్రస్తుతం అందరికంటే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. మార్జిన్ కూడా మామూలు రేంజ్ లో లేదు, నిన్నటి ఎపిసోడ్ ఆమె గ్రాఫ్ ని మరింత పెంచేసింది.
నిన్న మొన్నటి వరకు టాప్ 1 కంటెస్టెంట్ కి టాప్ 2 కంటెస్టెంట్ కి కేవలం మూడు నుండి నాలుగు శాతం ఓట్ల తేడా మాత్రమే ఉండేది. కానీ ఈ వారం మాత్రం మొదటి స్థానం లో ఉన్న యష్మీ కి, రెండవ స్థానం లో ఉన్న గౌతమ్ కి 20 శాతం తేడా ఉంది. యష్మీ కి ఆ రేంజ్ ఓటింగ్ రావడానికి కారణం, ఆమె ఓటింగ్ తో పాటు, నిఖిల్, పృథ్వీ, ప్రేరణ మరియు నబీల్ ఓట్లు కూడా తోడు అయ్యాయి. అందుకే ఆమెకి ఆ స్థాయి లీడ్ వచ్చింది. మరోపక్క గౌతమ్ మరోసారి సోలోబాయ్ అనిపించుకున్నాడు. మొదటి వారం ఎలిమినేషన్ వరకు వచ్చిన ఈయన, ఈ వారం మాత్రం మంచి ఓటింగ్ తో, తన సొంత ఆట ద్వారా ప్రేక్షకులను మెప్పించి, ఇతర కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఓట్లు అవసరం లేకుండా 25 శాతం కి పైగా ఓట్లతో టాప్ 2 స్థానం లో కొనసాగుతున్నాడు. నిన్న ఆయన ఆడిన ఆట తీరుకు ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది.
అలాగే మూడవ స్థానం లో టేస్టీ తేజా కొనసాగుతున్నాడు. ఇతనికి ప్రేరణ ఫ్యాన్స్ ఓట్లు కూడా కాస్త తోడైంది. కానీ ఈ సీజన్ లో తన మార్క్ గేమ్ చూపించడంతో తేజా కంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. చివరి రెండు స్థానాల్లో హరి తేజ, నయనీ పావని ఉన్నారు. వీళ్లిద్దరికీ సమానమైన ఓటింగ్ వస్తుంది. ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చు. ప్రస్తుతానికి అయితే నయనీ పావని ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుందో. ఇదంతా పక్కన పెడితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే కనుక జరిగితే టేస్టీ తేజ ని ఉద్దేశపూర్వకంగా బిగ్ బాస్ టీం హౌస్ నుండి బయటకి పంపే అవకాశాలు ఉన్నాయి.