https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ‘నిఖిల్’ టీం లోకి ఆదిత్య..’సీత’ టీం లోకి మణికంఠ..బిగ్ బాస్ ఫైనల్ ట్విస్ట్ అదుర్స్!

బిగ్ బాస్ కూడా పెద్ద పెద్ద టాస్కులు ప్రారంభం నుండే ఇచ్చేవారు. కానీ ఈ సీజన్ కి బడ్జెట్ చాలా లిమిటెడ్ అట. అందుకే ఎక్కువగా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టి కంటెంట్ ని రప్పించుకుని టాస్కులు పెడుతున్నాడు బిగ్ బాస్.

Written By:
  • Vicky
  • , Updated On : September 28, 2024 / 08:12 AM IST

    Bigg Boss Telugu 8(49)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ఒక వారం ఫుల్ ఫైర్ మీద ఉంటే, మరో వారం చప్పగా సాగుతుంది. గత వారం జరిగిన టాస్కులు హౌస్ లో ఎంతటి ఫైర్ ని రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఈ వారం మాత్రం చాలా చప్పగా, అసలు చెప్పుకోవడానికి ఏమి లేని విధంగా సాగుతుంది. హౌస్ లోకి మరో రెండు వారాల్లో 12 మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టబోతున్నారని, వాళ్ళని ఆపేందుకు కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ‘సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ టాస్కులు గెలవాల్సి ఉంటుందని బిగ్ బాస్ అంటాడు. రాబోయే మూడు రోజుల్లో 12 టాస్కులు ఉంటాయేమో అని కంటెస్టెంట్స్ అనుకున్నారు. కానీ కేవలం 5 టాస్కులకే పరిమితం చేసాడు బిగ్ బాస్. ఆ 5 టాస్కులు కూడా చిన్న పిల్లలు ఆడుకునేటివి అని చెప్పొచ్చు. గత సీజన్ లో టాస్కులు ఏ రేంజ్ లో ఉండేవో మన అందరికీ తెలిసిందే. కంటెస్టెంట్స్ అందరూ ఎంతో శ్రద్ద పెట్టి ఆడేవారు.

    బిగ్ బాస్ కూడా పెద్ద పెద్ద టాస్కులు ప్రారంభం నుండే ఇచ్చేవారు. కానీ ఈ సీజన్ కి బడ్జెట్ చాలా లిమిటెడ్ అట. అందుకే ఎక్కువగా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టి కంటెంట్ ని రప్పించుకుని టాస్కులు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇదంతా పక్కన పెడితే నిన్న బిగ్ బాస్ ఒక చిన్న ట్విస్టుని ఇస్తూ ఒక ‘గోల్డెన్ బ్రేస్లెట్’ ని కంటెస్టెంట్స్ కి పరిచయం చేస్తాడు. ఆ బ్రేస్లెట్ ఎవరి దగ్గరైతే ఉంటుందో వాళ్ళు ఒక క్లాన్ నుండి మరో క్లాన్ కి వెళ్లొచ్చు. అలాగే తానూ బయటకి వచ్చిన క్లాన్ కి, తాను వెళ్తున్న క్లాన్ లో ఎవరో ఒకరిని పంపొచ్చు. చాలాసేపటి వరకు ఎవరు ఆ గోల్డెన్ బ్రేస్లెట్ తీసుకోవాలి అనే దానిపై చర్చలు జరుగుతుంది. చివరికి మణికంఠ ‘నేను తీసుకుంటా బిగ్ బాస్’ అని అంటాడు.

    అప్పుడు బిగ్ బాస్ తో మణికంఠ మాట్లాడుతూ ‘నేను నిఖిల్ క్లాన్ నుండి సీత క్లాన్ కి వెళ్లాలని అనుకుంటున్నా బిగ్ బాస్’ అని అంటాడు. అప్పుడు బిగ్ బాస్ ‘నువ్వు మీ టీం కి ఒకరిని నువ్వు వెళ్లబోయే క్లాన్ నుండి పంపాలి’ అని అంటాడు. అప్పుడు మణికంఠ ‘నేను ఆదిత్య ఓం ని పంపాలని అనుకుంటున్నా బిగ్ బాస్. ఎందుకంటే ఆదిత్య గారికి ఈ సీత క్లాన్ లో అందరితో మంచి రిలేషన్ ఉంది, కానీ నిఖిల్ క్లాన్ లో ఎవరితో మంచి రిలేషన్ లేదు. అందుకే ఆయన అక్కడికి వెళ్లి తన సర్కిల్ పెంచుకోవాలని కోరుకుంటున్నాను’ అని ఆదిత్య ని పంపిస్తాడు. నిఖిల్ క్లాన్ లో మణికంఠ ఉండలేకపోయాడు, అతనికి ఆడే అవకాశాన్ని కాదు, ఆ క్లాన్ లో సభ్యులు ఆయన్ని కనీసం మనిషి లాగా కూడా చూడలేదని మొన్నటి ఎపిసోడ్ చూస్తే అందరికీ క్లారిటీ గా అర్థం అయ్యింది, అందుకే మణికంఠ అవకాశం దొరకగానే క్లాన్ మారిపోయాడు.