Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు పితపక్ష ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి:
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. విద్యార్థుల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితులతో సంతోషంగా ఉంటారు.
వృషభ రాశి:
ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన అవకాశాలను విడిచిపెట్టొద్దు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోకపోతే పరిస్థితి ఉద్రిక్తంగా మారే ప్రమాదం. వ్యాపారులను కొందరు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు.
మిథున రాశి:
ఈరాశి వ్యాపారులకు ఈరోజు భారీగా అర్థిక ప్రయోజనాలు ఉండనున్నాయి. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. దూర ప్రయణాలు చేసే అవకాశం ఉంది. ఎవరి మాటలను నమ్మకుండా ముందుకు వెళ్లడమే మంచిది.
కర్కాటక రాశి:
వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. కొత్త పెట్టుబడులు పెడుతారు. విద్యార్థులు కష్టానికి ఫలితం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే కాస్త ఆలోచించాలి. కుటుంబ వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది.
సింహారాశి:
ఆదాయం పెరిగినా ఖర్చులు ఉంటాయి. అందువల్ల చూస్తూ ఖర్చు పెట్టాలి. విద్యారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కొన్ని పనుల కారణంగా బిజీ వాతావరణంలో ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
కన్య రాశి:
కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విలువైన సమయాన్ని వృథా చేయొద్దు. వ్యాపారులకు తగినంత డబ్బు వస్తుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటారు.
తుల రాశి:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఉన్న సమస్యలకు పరిష్కారం కనుగ్గొంటారు. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు ఇతరులపై ఆధారపడుతారు.
వృశ్చిక రాశి:
పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించే అవకాశం. కొన్ని పనులకు ఆటంకాలు కలుగుతాయి. సోమరితనంగా ఉండడం వల్ల కష్టాలు ఎదురవుతాయి.
ధనస్సు రాశి:
సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు తోటి వారితో ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక సాయం అందుతుంది.
మకర రాశి:
ఉద్యోగులు ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఇవ్వొచ్చు. రాజకీయాల్లో ఉండేవారికి సానుకూల ఫలితాలు ఉంటాయి.
కుంభరాశి:
కుటుంబ సభ్యుల కోసం కష్టపడుతారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెడుతారు. విదేశాల నుంచి డబ్బు అందుతుంది. లాభదాయకరమైన పరిస్థితులు ఉంటాయి. మాటలను అదుపులో ఉంచుకోవాలి.
మీనరాశి:
సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు.