Bigg Boss Telugu 8: ప్రతీ సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా బిగ్ బాస్ ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ ని కంటెస్టెంట్స్ మధ్య పెట్టాడు. ఈసారి మెగా చీఫ్ గా ప్రేరణ అవ్వడంతో, ఆమెకి ఈ గేమ్ నుండి 5 మంది కంటెస్టెంట్స్ ని తప్పించమని చెప్తాడు బిగ్ బాస్. అప్పుడు ప్రేరణ పృథ్వీ, గౌతమ్, హరితేజ, గంగవ్వ, విష్ణు ప్రియ ని తప్పిస్తుంది. ఈ అంశం లో ప్రేరణ తీవ్రమైన నెగటివిటీ ఎదురుకునే అవకాశాలు ఉన్నాయి. రేపు ప్రసారం అవ్వబోయే రచ్చరచ్చగా ఉండబోతుంది. ప్రేరణ కి నిఖిల్, యష్మీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరికీ ఈ గేమ్ ఆడే ఛాన్స్ ఇచ్చింది. ఇది పెద్దగా డీ కోడ్ చేయాల్సిన పని లేదు. మొదటి నుండి గొడవలు పడుతున్న నభీల్ ని గేమ్ లో ఆడనిచ్చే అవకాశం ఇచ్చి, పృథ్వీ ని తప్పించడం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. ఇక టేస్టీ తేజ, అవినాష్ ఆమెకి ఈమధ్య మంచి స్నేహితులు అయ్యారు కాబట్టి వాళ్ళని కూడా ఈ గేమ్ ఆడేందుకు సహాయపడింది ప్రేరణ.
అయితే ఈమె అన్యాయం గా గౌతమ్, పృథ్వీలకు వెన్నుపోటు పొడిచిందని లైవ్ లో చూసిన ప్రతీ యొక్క ప్రేక్షకుడికి అర్థమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గౌతమ్, పృథ్వీ ఇద్దరూ కూడా ప్రేరణ ని మెగా చీఫ్ చేసేందుకు సహాయపడ్డారు. వాళ్లిద్దరూ తల్చుకొని ఈమెను టార్గెట్ చేసి ఉండుంటే కచ్చితంగా మెగా చీఫ్ అయ్యేది కాదు. చాలా సాఫ్ట్ గా ఆమెని గెలిపించేందుకు ఈ ఇద్దరు చివరి రౌండ్స్ లో కృషి చేసారు. అలా సహాయం చేసిన ఆ ఇద్దరినీ ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ నుండి తప్పించడం, అదే విధంగా చివరి రౌండ్ లో ఎవరికీ సపోర్టు చేయకుండా సేఫ్ గేమ్ ఆడిన నభీల్ ని ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ లో ముందుకు వెళ్లేందుకు సహాయ పడడం వంటివి చూస్తుంటే ఈమె కచ్చితంగా గౌతమ్, పృథ్వీ మీద మనసులో కోపం పెట్టుకొని వెన్నుపోటు పొడిచింది అనేది చూసే ఆడియన్స్ కి అనిపించింది.
ప్రేరణ మొదటి నుండి అంతే, మొన్న కూడా రోహిణి తో నేను క్లోజ్ గా ఉండే వాళ్ళు కూడా నాకు సహాయం చేయలేదు, నువ్వు చేసావు అని చెప్పుకొచ్చింది. కానీ వాస్తవం ఏమిటంటే మొదటి వారం నుండి ప్రేరణని యష్మీ ఎన్నో సందర్భాలలో సేవ్ చేస్తూ వచ్చింది. కిల్లర్స్ గర్ల్స్ టాస్క్ లో హౌస్ మేట్స్ మొత్తం ప్రేరణని టార్గెట్ చేస్తే, యష్మీ మాత్రం ప్రేరణ కోసం ఆడింది. అది కూడా చిన్నగా కాదు, చాలా కసిగా ఆడింది. చివరికి గత వారంలో ఈమెని నామినేషన్స్ నుండి తప్పించి యష్మీ నామినేషన్స్ లోకి వెళ్ళింది. ప్రేరణ కి యష్మీ కి నామినేషన్స్ నుండి కాపాడే అవకాశం వచ్చినా కూడా కాపాడలేదు. ఇలా యష్మీ వద్ద ఇన్ని సహాయాలు పొందిన ప్రేరణ, యష్మీ కోసం ఒక్కసారి కూడా బలంగా సపోర్టివ్ గా నిలబడలేదు. ఈరోజు చూస్తే గౌతమ్, పృథ్వీల వద్ద సహాయం పొంది వాళ్లకు వెన్నుపోటు పొడిచింది, ఇవన్నీ గమనిస్తే ప్రేరణ లాంటి స్వార్థపరురాలు బిగ్ బాస్ హౌస్ లో ఎవ్వరూ లేరు అనొచ్చు.