Bigg boss 7 Telugu1
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ 7 ఆరో వారం చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇంటిలోకి కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొత్త వాళ్ళని పోటుగాళ్ళుగా, పాత వాళ్ళని ఆటగాళ్లుగా విభజించారు బిగ్ బాస్. వీరిలో ఎవరు గొప్ప అని తేల్చుకోవడం కోసం కొన్ని పోటీలు పెడుతున్నారు బిగ్ బాస్. ఈ గేమ్స్ అన్ని వినోదాత్మకంగా ఇంకా మైండ్ కి పదును పెట్టే విధంగా ఉంటున్నాయి. టాస్క్ మధ్యలో బిగ్ బాస్ ఇంటరాక్ట్ అవుతూ వినోదం పండిస్తున్నాడు.
తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో శోభా శెట్టి దొంగతనంగా మేకప్ వేసుకుంది. ఇందుకు గాను లగేజ్ డిపార్ట్మెంట్ హెడ్ అర్జున్,శోభ కి పనిష్మెంట్ ఇవ్వాలి అని బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. ఇక అర్జున్,తేజా తో డిస్కస్ చేసి తన టీ షర్ట్ తెమ్మని చెప్పాడు.ఆ కంపు కొట్టే టీ షర్ట్ ని వేసుకోవాలి అని అర్జున్ పనిష్మెంట్ ఇచ్చాడు. ఇంక తప్పక శోభా ఆ టీ షర్ట్ వేసుకుంది.
ఇంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. తేజా నీకు ఒక ఐదు నిమిషాలు నిద్ర పోవడానికి సమయం బిగ్ బాస్ ఇస్తున్నారు. దీనికి సంచాలకులుగా శోభా వ్యవహరించాలి అని చెప్పాడు. ఇక తేజా అయితే రెచ్చిపోయాడు. ఏకంగా శోభా భుజం పై నిద్రపోతూ,గురక పెడుతూ శోభా ని ఆడుకున్నాడు.
ఇదంతా చూడటానికి చాలా ఫన్నీగా ఉంది. హౌస్ మేట్స్ నవ్వుతు తెగ ఎంజాయ్ చేసారు. ఇది ఇలా ఉండగా,హూ ఈజ్ ఫోకస్డ్ అని మరొక గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇరు జట్లు బాగా పోటీ పడుతూ ఆడుతున్నట్లు కనిపించారు. ఇక ఆరో వారం అమర్ దీప్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, తేజా, నయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.