Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఎనిమిదో వారానికి సంబంధించిన కెప్టెన్సీ రేస్ లో భాగంగా బిగ్ బాస్ ఫైనల్ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలిచిన శోభా,పల్లవి ప్రశాంత్,ప్రియాంక,గౌతమ్,సందీప్ లో ఒకరుకి కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని బిగ్ బాస్ తెలిపారు. మిగిలిన ఇంటి సభ్యులు తదుపరి కెప్టెన్ ఎవరు అవ్వాలి అని నిర్ణయించాలి అని చెప్పారు. ఈ ప్రక్రియలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు జరిగాయి.
శోభా ఇంకా యావర్ ఐతే ఓ రేంజ్ లో అరుచుకున్నారు.తాజాగా విడుదలైన ప్రోమోలో హౌస్ మేట్స్ టాస్క్ లో జరిగిన గొడవలు గురించి డిస్కషన్ పెట్టారు. ముందుగా రతిక, యావర్ తో మాట్లాడుతూ ‘పిచ్చోడు అనడం చాలా బ్యాడ్ ఆమెను బయట బ్యాడ్ గా అనుకుంటారు అని అంటుంది. అమ్మాయి ఐతే ఏమైనా మాట్లాడొచ్చా అని యావర్ అనగానే, అలా ఏం లేదు అమ్మాయి ఐతే ఏమైనా మాట్లాడొచ్చు అనేమీ లేదు అని రతిక చెప్పింది.
ఆ తర్వాత అమర్ మాట్లాడుతూ ‘ఐదు మందిలో ముగ్గురు మాత్రమే వేరే వాళ్ళకి వేస్తారు మిగిలిన వారు ప్రశాంత్ ని ముట్టరు’ అని రతిక తో చెప్పాడు. ఇక అమర్ దీప్,ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ ఒక డైలాగ్ వేశాడు. రైతు అనే వాడు పండించడం తో పాటు పంచుకోవడం కూడా తెలుసుకోవాలి అని చెప్పి అమర్ మిర్చి దండ వేశారు. దీంతో రైతు బిడ్డ తొడ కొట్టి సవాల్ చేశాడు.
తేజ కూడా వేరే వాళ్ళకి అవకాశం రావాలి అని చెప్తూ ప్రశాంత్ మెడలో మిర్చి దండ వేశాడు.
ఇక ప్రియాంక,భోలే గురించి మాట్లాడుతూ ‘గట్స్ ఉంటే కరెక్ట్ రీజన్ చెప్పి తియ్యాలి అని ప్రశాంత్ తో చెప్పింది.తర్వాత అశ్విని ‘ప్రశాంత్ డిజర్వింగ్ లేక అన్ డిజర్వింగ్ అని చెప్పే హక్కు ఈ హౌస్ లో ఎవరికి లేదు అని చెప్పింది. దీంతో అశ్విని అన్న మాటను పాయింట్ అవుట్ చేస్తూ తేజా నువ్వు ఆ మాట ఎందుకు అన్నావ్ అని అశ్విని తో వాదించాడు.ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళని రెండో సారి నేను అవ్వనివ్వను అంటూ అమర్ కుళ్ళు బుద్ధి బయట పెట్టాడు.వాదనలు ప్రతివాదనలు తో ప్రోమో ముగిసింది.