https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ప్రశాంత్, ప్రియాంకలలో ఆ ఛాన్స్ ఎవరికి? బాల్ అర్జున్ కోర్టులో!

నిన్న ఎపిసోడ్లో ఏమి జరిగిందంటే... యావర్, ప్రశాంత్, ప్రియాంక కోసం శివాజీ, అమర్, అర్జున్ లు ఆడుతున్నారు. అయితే వీరు ముగ్గురూ ఒకేసారి టాస్క్ లో పోటీపడాల్సి ఉంటుంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2023 / 10:06 AM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఫినాలే వీక్ నడుస్తుంది. కాగా నిన్నటి ఎపిసోడ్ లో మరోసారి హాచి .. గ్రహాంతర వాసులను రప్పించారు బిగ్ బాస్. అయితే కంటెస్టెంట్స్ కి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి ఇంటి భోజనాన్ని ఆస్వాదించే ఛాన్స్ ఇచ్చారు. ఇందులో భాగంగా అర్జున్, శివాజీ, అమర్ దీప్ కోసం భోజనం వచ్చింది. కాగా గత ఎపిసోడ్ లో అర్జున్ కోసం యావర్, శివాజీ కోసం ప్రియాంక .. అమర్ కోసం శివాజీ గేమ్ ఆడి వారికి ఇంటి ఫుడ్ సంపాదించారు.

    ఇక నిన్న ఎపిసోడ్లో ఏమి జరిగిందంటే… యావర్, ప్రశాంత్, ప్రియాంక కోసం శివాజీ, అమర్, అర్జున్ లు ఆడుతున్నారు. అయితే వీరు ముగ్గురూ ఒకేసారి టాస్క్ లో పోటీపడాల్సి ఉంటుంది. టాస్క్ కంప్లీట్ చేసి ముందు గంట కొట్టిన వారు ఆహారం లభించని ఒకరిని ఎంచుకోవచ్చు. ఇందులో భాగంగా మొదట ‘కలర్ బాల్స్ ‘ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో శివాజీ తెగ కన్ఫ్యూజ్ అయిపోయాడు.

    అటు ఇటు తిప్పుతూ బిత్తర చూపులు చూసాడు. ఒరేయ్ .. ఏంట్రా రాధిది అంటూ అమర్ ని అడిగాడు. తిప్పు .. వస్తుంది అంటూ అమర్ చెప్పాడు. ఇక అర్జున్, శివాజీ తిప్పుతూ ఉండగానే .. అమర్ వెళ్లి గంట కొట్టాడు. టాస్క్ లో గెలిచిన అమర్ .. యావర్ కి ఇంటి భోజనం తినే అవకాశం ఇస్తున్నట్లు చెప్పాడు.

    ఇక తర్వాత ముగ్గురూ బ్యాలెన్సింగ్ టాస్క్ ఆడారు. ఇందులో బిగ్ బాస్ చెప్పిన విధంగా కప్పులు ప్లేటులు ఒకదాని పై ఒకటి ఉంచి బ్యాలన్స్ చేయాలి. కాగా శివాజీ ముందే చేతులెత్తేశాడు. కొద్దిసేపటికి అమర్ కూడా బ్యాలన్స్ కోల్పోయాడు. ఇక అర్జున్ మాత్రం అలాగే బ్యాలన్స్ చేస్తూ నిలబడి ఉన్నాడు. మరి అర్జున్ ఎవరికీ ఫేవర్ చేస్తాడో చూడాలి. ప్రియాంక, ప్రశాంత్ లలో ఎవరికి ఇంటి ఫుడ్ లభిస్తుందో చూడాలి మరి.