Bigg Boss Telugu 5: బిగ్ బాస్ టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. హౌస్ లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్స్… సిరి, సన్నీ, మానస్, కాజల్, షణ్ముఖ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎవరికి వారు టైటిల్ కొడతామంటూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 14 వారాలు తమ గేమ్ తో ఫ్యాన్స్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్స్ ఫైనల్ కి చేరాక కొంచెం రిలాక్స్ అయ్యారు. అయితే హౌస్ బయట పోరు ఆసక్తికరంగా మారింది.

సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ క్యాంపైన్ జోరుగా నడుస్తుంది. సిరిని మినహాయిస్తే… మిగతా నలుగురు కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ వాళ్ళ కోసం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్ కి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కంటెస్టెంట్స్ కి మద్దతుగా సెలబ్రిటీలు కూడా ప్రచారం చేయడం విశేషం. సింగర్ శ్రీరామ్ కి ఓటు వేయాలంటూ ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు సతీమణి స్వయంగా వీడియో బైట్ విడుదల చేయడం విశేషం.
ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు. నలుగురు మేల్ కంటెస్టెంట్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తుండగా.. టైటిల్ ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. కొందరైతే బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారట. దీని కోసం పలు మీడియా సంస్థలు, వెబ్ సైట్స్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. వివిధ సర్వేలు భిన్నమైన ఫలితాలు చూపిస్తున్నాయి. అయితే మెజారిటీ పోల్స్ సన్నీని విన్నర్ గా తేల్చినట్లు సమాచారం. బిగ్ బాస్ ప్రేక్షకులలో ఎక్కువమంది టైటిల్ కి సన్నీ అర్హుడన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు.
ఆ తర్వాత షణ్ముఖ్, శ్రీరామ్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. మొదట్నుంచి గేమ్ లో షణ్ముఖ్ ముందున్నాడు. అయితే చివరి వారాల్లో అతను నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. సిరి విషయంలో అతడి ప్రవర్తనా తీరు నెగిటివ్ మార్క్స్ పడేలా చేసింది. సిరిని అకారణంగా మానసిక వేదనకు గురి చేయడం అతని ర్యాంకింగ్ ని దెబ్బతీసిందని పలువురి అభిప్రాయం.
అంత మాత్రాన అతడు టైటిల్ రేసులో లేడని కాదు. కొన్ని పోల్స్ లో షణ్ముఖ్ మెజారిటీ ఓట్లు దక్కించుకుంటున్నాడు. మరో ఇద్దరు కంటెస్టెంట్స్ శ్రీరామ్, మానస్ తమ బలాలు, అనుకూలతలు కలిగి ఉన్నారు. వారు కూడా ఫైనల్ లో గట్టిపోటీ ఇస్తారు అనడంలో సందేహం లేదు. వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కాగా.. విజేత ఎవరో తేలిపోనుంది.
Also Read: Pushpa Telugu Movie Review: ‘పుష్ప- ది రైజ్’ రివ్యూ
ఇప్పటివరకు నాలుగు సీజన్స్ పూర్తి కావడం జరిగింది. ఎన్టీఆర్ హోస్ట్ గా సాగిన ఫస్ట్ సీజన్ టైటిల్ నటుడు శివబాలాజీ గెలుచుకున్నారు. సెకండ్ సీజన్ లో కౌశల్, థర్డ్ టైటిల్ రాహుల్ సిప్లిగంజ్ అందుకోవడం జరిగింది. 2020లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ అభిజీత్ గెలుపొందారు.
Also Read: Tollywood Stars: టాలీవుడ్ స్టార్స్ అందరూ ట్యూషన్ లో చేరండయ్యా..!