Chandrababu: ఏపీలో చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేనంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. ఘన చరిత్ర ఉన్న టీడీపీలో ఇప్పుడు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే టీడీపీ ఖజానా ఖాలీ అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ఇందుకోసమే చంద్రబాబు ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోవట్లేదంట.
వినడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉన్నా ఇదే నిజం. అందుకే చంద్రబాబు నాయుడు కేవలం అమరావతికి మాత్రమే పరిమితం అవుతున్నారు. వాస్తవానికి ప్రతిపక్ష నేత అంటే నిత్యం ప్రజల్లోనే ఉండాలి. అప్పుడే ఆయనకు ఆదరణ పెరుగుతుంది. ప్రజల్లో కోల్పోయిన నమ్మకాన్ని సంపాదించాలంటే ఎక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే అక్కడకు వెళ్లాలి. కానీ చంద్రబాబు మాత్రం చాలా రోజులుగా ఇంటికే పరిమితం అవుతున్నారు. పెద్దగా జనాల్లోకి వెళ్లట్లేదు.
వాస్తవానికి ఆయన చాలా రోజులుగా పార్టీ జిల్లా నేతలను కూడా ఇంటికే పిలపించుకుని మాట్లాడుతున్నారు తప్ప జిల్లాల పర్యటనలకు వెళ్లట్లేదు. వరుసగా జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన పెద్దగా తిరగలేదు. కుప్పంలో మాత్రమే పర్యటించారు. వర్షాల కారణంగా వరద బాధితులను కలిసి మాట్లాడారు తప్ప పార్టీ నేతలతో మీటింగ్ పెట్టుకోవట్లేదు. అయితే అసెంబ్లీ ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టుకోవాలని అనుకున్నారు.
Also Read: AP CM: సారూ.. చాలా బిజీ.. ఐపీఎస్ లతో కూడా మాట్లాడలేదట?
తనకు జరిగిన అవమానం మీద మాట్లాడాలని అనుకున్నారు. కానీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు పెట్టుకోవడానికి పార్టీ ఖజానాలో డబ్బులు లేవు. గౌరవ సభలను నిర్వహించేందుకు చాలా ఖర్చు అవుతుందని, కాబట్టి ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో జిల్లా పార్టీ కమిటీలు ఆ ఖర్చులను భరించే స్థాయిలో లేవు. కాబట్టి చంద్రబాబు తన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఆర్థిక సంక్షోభం చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది.
Also Read: Pawan kalyan: పవన్ కు లెక్కుంది.. అదే రేపు ఏపీలో కిక్కుస్తుందట..!