
Bigg Boss Telugu 5: పోయిన ఆదివారం ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 రంజుగా సాగుతోంది. కింగ్ నాగార్జున ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపాడు. తొలి ఐదారురోజుల్లోనే అలకలు, ఏడుపులు, పెడబొబ్బలు.. గొడవలు బాగా జరుగుతున్నాయి. అనుక్షణం ఉత్కంఠ, ఆసక్తి, కామెడీని పంచేలా ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
తొలివారంలో ఆరుగురు నామినేషన్ లో ఉండగా.. ఎవరు ఎలిమినేట్ అవుతారనే సస్పెన్స్ నెలకొంది. ఈ ఆదివారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ వారి వారి క్యారెక్టర్లు నచ్చిన వారంతా వారికి ఫ్యాన్స్ క్లబ్ ఏర్పాటు చేశారు. తమ కంటెస్టెంట్లకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి.
హౌస్ లో అందరికంటే కోపంగా.. అగ్రెసివ్ గా లహరి షారీ కనిపిస్తున్నారు. ఆమె ఇప్పటికే చిన్న చిన్న మాటలకే హమీదా, ఆర్జే కాజల్ ను ఉతికి ఆరేశారు. ఫైర్ బ్రాండ్ గా హౌస్ లో పేరు తెచ్చుకున్నారు. తన వ్యక్తిత్వాన్ని అగౌరపరిచేలా కంటెస్టెంట్లు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా లహరీ షారీ తిప్పి కొట్టే తీరు తమను ఆకట్టుకుంటోందంటూ పోస్టులు పెడుతున్నారు.
అత్యంత ఆగ్రహంతో ఊగిపోతున్న లహరిని ఇప్పుడు బిగ్ బాస్ మౌస్ లో ‘లేడీ అర్జున్ రెడ్డి’ అంటూ పిలుస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. ఆమె ఆటిట్యూడ్ కూడా అలానే ఉందని కొనియాడుతున్నారు.
మీడియా బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు లహరి షారీ. సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యారు. ఓ అట్రాక్టివ్ యాంకర్ గా పేరు పొందారు. అర్జున్ రెడ్డి సినిమాలో ఓ క్యారెక్టర్ లో మెరిసారు. నర్స్ పాత్రలో నటించారు. ప్రస్తుతం బిగ్ బాస్ లోనే అత్యంత ఆవేశపూరిత ఫైర్ బ్రాండ్ గా నిలిచారు.