Big Boss Telugu 5: తరచూ యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ లో చూసేవారికి దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె పాటలు వీడియోలు వెబ్ సిరీస్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఈమె బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత గుర్తింపు సంపాదించుకున్న దీప్తి సునైనా ఆ తర్వాత షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి పలు వెబ్ సిరీస్ లో నటించింది.ఇందులో ఉన్నటువంటి సన్నివేశాలు చూస్తే నిజంగానే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందనే విషయం తెలుస్తుంది.
ఎంతో చనువుగా ఉంటే వీరిద్దరూ ఇలా ఉన్నఫలంగా బ్రేకప్ చెప్పుకోవడానికి గల కారణం ఏంటి అంటూ
నెటిజన్ లు ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం ప్రసారమైన ఎపిసోడ్ లో సిరి షణ్ముఖ్ జస్వంత్ పై ముద్దు పెట్టడమే కారణం అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే సిరి ముద్దుపెట్టడంతో దీప్తి ఎంతో ఫీల్ అయిందని ఈ క్రమంలోనే తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షణ్ముఖ్ జస్వంత్ ను అన్ ఫాలో చేసినట్లు తెలుస్తుంది.ఇలా షణ్ముఖ్ జస్వంత్ ను అన్ ఫాలో చేయడంతో దీప్తి షన్నుతో బ్రేకప్ చెప్పుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.