Bigg Boss Tamil 8 : రియాల్టీ షోలలో బిగ్ బాస్ కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. భావోద్వేగాలు, అటతీరు, స్పందించే విధానం, తోటి కంటెస్టెంట్ల తో ప్రవర్తించే తీరు.. ఇలా అన్ని అంశాలలో బిగ్ బాస్ ఆట సాగుతూ ఉంటుంది. అయితే ఇందులో మెరుగైన ఆట తీరు కొనసాగించిన వారు విజేతగా నిలుస్తారు.
బిగ్ బాస్ అనేది మన దేశానికి సంబంధించిన రియాల్టీ షో కాదు. ఎప్పుడైతే శిల్పా శెట్టి అవమానానికి గురైందో.. అప్పటినుంచి ఈ షో పట్ల భారతీయులు ఆసక్తిని కనపరచడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో కార్పొరేట్ కంపెనీలు రంగ ప్రవేశం చేయడంతో ఈ రియాల్టీ షో కాస్త మనదేశంలో కూడా విశేషమైన ప్రాచుర్యం పొందింది.
ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో పూర్తయింది. తమిళంలో ఇంకా కొనసాగుతోంది. తమిళంలో కొనసాగుతున్న బిగ్ బాస్ షోకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ రియాల్టీ షోలో రకరకాల టాస్కులు ఉంటాయి. షో లో భాగంగా నిర్వహించిన టాస్క్ లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియా ద్వారా చర్చనీయాంశంగా మారింది.
తమిళ బిగ్ బాస్ లో కంటెస్టెంట్లుగా వీజే పారు, సాండ్ర ఉన్నారు. వీరి మధ్య జరిగిన ఒక టాస్క్ వివాదంగా మారింది. ఈ వివాదం బిగ్ బాస్ కారు టాస్క్ ద్వారా వచ్చింది. కార్ టాస్క్ లో పోటీదారులు నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరించారు. వారి మధ్య మాటల యుద్ధం సాగింది. అయితే ఈ వ్యవహారంలో వీజే పారు కారు టాస్క్ లో భాగంగా అందులో నుంచి సాండ్రా ను బయటికి తన్నుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. కారులో నుంచి బయటపడిన సాండ్రా స్పృహ తప్పి పడిపోయినట్లు కనిపించింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియా ద్వారా బయటికి రావడంతో రచ్చ అయిపోయింది. ” పారు కారులో ఉన్నాడు. టాస్క్ కొనసాగుతుండగానే అత్యంత బలంగా తన్నాడు. దీంతో సాండ్ర కింద పడిపోయింది. స్పృహ కూడా కోల్పోయింది. చూస్తున్న మాకు ఇబ్బందిగా అనిపించింది. బిగ్ బాస్ అనేది మైండ్ గేమ్ కాదు, హింసాత్మక ధోరణిగా మారిపోయిందని” నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
ఈ ఘటన తర్వాత ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. వచ్చే ఎపిసోడ్లో సేతుపతి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. అక్టోబర్ ఐదు న ప్రీమియర్ అయిన బిగ్ బాస్ తమిళ సీజన్ 9 స్టార్ విజయ్ ఛానల్లో ప్రసారమవుతోంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ కావడంతో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిఆర్పి రేటింగ్స్ కోసం ఈ స్థాయికి దిగజారాలా అంటూ మండిపడుతున్నారు.
Shocking violence in #BiggBossTamil9: Contestant #SandraAmy brutally kicked from task vehicle by Kamrudin & Parvathy, causing tears, collapse, and seizures.
Unchecked rough and unethical behavior from Day 1 endangers lives and violates Article 21. Shame on @vijaytelevision for… pic.twitter.com/YZAXyv1rfm
— Lt Col N Thiagarajan Veteran (@NTR_NationFirst) January 2, 2026