Sydney Thunder Vs Hobart Hurricanes: టి20 అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత.. క్రికెట్ స్వరూపం మొత్తం పూర్తిగా మారిపోయింది. 2007లో అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి టి20 ఫార్మాట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ మరుసటి సంవత్సరం భారత క్రికెట్ నియత్రణ మండలి ఐపీఎల్ (Indian premier league) కు శ్రీకారం చుట్టింది. ఆ తర్వాత క్రికెట్ స్వరూపం మొత్తంగా మారుకుంటూ వస్తోంది. దీనికి తోడు ప్లేయర్లకు విపరీతంగా అవకాశాలు లభిస్తున్నాయి. డబ్బు కూడా దండిగా అందుతోంది. ఐపీఎల్ ఆవిర్భవించిన తర్వాత.. ఆయా దేశాలు క్రికెట్ లీగ్ లు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడో ఒకచోట టి20 క్రికెటర్ లీగ్ లు నడుస్తున్నాయి. స్థానికంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఈ టోర్నీలకు ప్రధాన ప్రయోజకకర్తలుగా వ్యవహరిస్తున్నాయి…
సౌత్ ఆఫ్రికాలో సౌత్ ఆఫ్రికా t20 లీగ్, ఆస్ట్రేలియాలో బిగ్ బాష్ లీగ్ (Big bash league) నడుస్తున్నాయి.. బిగ్ బాష్ లీగ్ ను సంక్షిప్తంగా బిబిఎల్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఈ టోర్నీలో శనివారం Sydney thunder, hobart hurricanes పోటీ పడుతున్నాయి. వాస్తవానికి ఈ రెండు జట్లలో పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు. కాకపోతే ఐపిఎల్ మాదిరిగా బిబిఎల్ కు రీచ్ ఉండదు. కానీ శనివారం సిడ్నీ థండర్, హోబర్ట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సోషల్ మీడియాను ఊపేసింది. గూగుల్ ట్రెండ్స్ లో ఇది నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ దెబ్బకు అమెరికా వెనిజులాపై చేసిన దాడికి సంబంధించిన వార్త కూడా రెండవ స్థానానికి పడిపోయింది.
ఈ మ్యాచ్లో సిడ్ని జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ స్టోరీ రాసే సమయం వరకు సిడ్నీ జట్టు 8.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ గ్లిక్స్ 0 పరుగులకు అవుట్ అయ్యాడు. సామ్ కోన్ స్టాస్ సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. బిల్లింగ్స్ 20 పరుగులు చేశాడు. మాడిసన్ (1), డేవిడ్ వార్నర్ (47) క్రీజ్ లో ఉన్నారు.
ఈ మ్యాచ్లో భాగంగా ప్రీడిక్షన్ సిడ్ని జట్టు వైపు అనుకూలంగా ఉంది. ఆ తర్వాత క్రమక్రమంగా హరి కేన్స్ వైపు మళ్ళి పోతోంది. ఈ మ్యాచ్ లో సిడ్ని గెలవడానికి 46% అవకాశం ఉంటే.. హరి కేన్స్ గెలవడానికి 54 శాతం అవకాశం ఉంది. హరి కేన్స్ బౌలర్లలో ప్రెస్ట్ విడ్జ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఎలీస్ ఒక వికెట్ సాధించాడు. బీబీఎల్ కు ప్రేక్షకుల నుంచి ఒక స్థాయి ఆదరణ మాత్రమే ఉంటుంది. అయితే సోషల్ మీడియా విస్తృతంగా ఉండడం.. ఆస్ట్రేలియా ప్లేయర్లు కూడా వివిధ టోర్నీలలో ఆడుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు ఈ ట్రోఫీ మీద ఆసక్తి పెరిగింది. అందువల్లే ఈ స్థాయిలో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.