https://oktelugu.com/

Bigg Boss Sunny: బట్టలు కొనుక్కోలేని స్థితి లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ సన్నీ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ కామెంట్స్

సన్నీ టైటిల్ గెలిచిన తర్వాత సోషల్ మీడియా లో చాలా మంది సన్నీ ప్రత్యేకమైన PR టీం ని ఏర్పాటు చేసుకున్నాడని, వారి వల్లే ఆయనకీ ఓట్లు వచ్చాయని కామెంట్స్ వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : May 24, 2023 / 02:14 PM IST

    Bigg Boss Sunny

    Follow us on

    Bigg Boss Sunny: బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా సన్నీ కోట్లాది మంది తెలుగు ప్రజల హృదయాలకు బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. హౌస్ లో ఉన్నన్ని రోజులు మొదటి రోజు ఎలా అయితే ఉన్నాడో,చివరి రోజు వరకు కూడా అలాగే ఉన్నాడు. అందుకే షణ్ముఖ్ లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న పాపులర్ సెలబ్రిటీ ని కూడా దాటుకొని ఆయన ఈ టైటిల్ ని గెలుచుకున్నాడు. ప్రస్తుతం ఆయన హీరో గా నటించిన ‘అన్ స్టాపబుల్’ సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతుంది.

    ‘ఈడో రకం ఆడో రకం’ మరియు ‘సన్ ఆఫ్ ఇండియా’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన డైమండ్ రత్నం బాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.సన్నీ ఈ చిత్రం తో పాటుగా ఆయన పలు సినిమాల్లో కూడా హీరో గా నటిస్తున్నాడు. అయితే సన్నీ టైటిల్ గెలిచినా తర్వాత ఆయన దురాభిమానులు సోషల్ మీడియా లో చాలా కథలే ప్రచారం చేసారు. వాటిపై రీసెంట్ గా సన్నీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు.

    సన్నీ టైటిల్ గెలిచిన తర్వాత సోషల్ మీడియా లో చాలా మంది సన్నీ ప్రత్యేకమైన PR టీం ని ఏర్పాటు చేసుకున్నాడని, వారి వల్లే ఆయనకీ ఓట్లు వచ్చాయని కామెంట్స్ వచ్చాయి. వీటి పై సన్నీ స్పందిస్తూ ‘ నేను ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని. నేను బిగ్ బాస్ హౌస్ కి వచ్చే ముందు నా చేతిలో కేవలం 30 వేల రూపాయిలు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బులు కూడా నేను బట్టలు కొనడానికే ఉపయోగించాను. నా దగ్గర ఉన్న డబ్బులు సరిపోకపోతే మా స్నేహితుల వద్ద అప్పు చేసి కొనుక్కున్నాను.

    అలాంటి ఆర్ధిక పరిస్థితి నాది’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా సన్నీ బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్న ఒక అమ్మాయితో డేటింగ్ లో భాగంగా గోవాకి వెళ్లాడని కూడా వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందిస్తూ నేను వెళ్ళింది బిగ్ బాస్ కంటెస్టెంట్ రాజ్ శేఖర్ తో, దానిని అమ్మాయితో వెళ్లినట్టు ప్రచారం చేసారు, అయినా అమ్మాయితో వెళ్తే తప్పేంటి అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.