Bigg Boss Telugu 9 Grand Launch: తెలుగు చిన్న తెరపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ 9’ ఘనంగా ప్రారంభమైంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కింగ్ నాగార్జునే హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ ఎంట్రీలో ఒక స్పెషల్ ట్విస్ట్ పెట్టి షోకు మరింత హైప్ తెచ్చారు.
నాగార్జున హౌస్‌లోకి అడుగుపెడుతున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఏకంగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ లోని ‘హంగ్రీ చీత’ సాంగ్‌ని ప్లే చేశారు. ఆ బీట్స్ మొదలైన క్షణం నుంచి స్టేజ్ మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది. నాగార్జున కూడా ఆ ఎనర్జీని ఫీలవుతూ ఉత్సాహంగా ప్రెజెంట్ చేయడం మరింత ప్రత్యేకంగా మారింది.
ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే ముందు నాగార్జునకు బిగ్ బాస్ పలు ఫన్నీ టాస్కులు కూడా ఇచ్చాడు. వాటిని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తూ ఆయన ఎంట్రీని ఇంకా ఎంగేజింగ్‌గా మార్చేశారు.
ప్రతి సీజన్‌కి స్టైలిష్‌గా, గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చే నాగార్జున ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మ్యూజిక్‌తో కలిసిపోయి గూస్‌బాంప్స్ ఇచ్చే మోమెంట్ క్రియేట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో కూడా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి, ‘బిగ్ బాస్ 9’ ప్రారంభోత్సవానికి పవన్ ఓజీ టచ్ తోనే సూపర్ కిక్ వచ్చిందని చెప్పాలి.