Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ మొత్తానికి ఐదో వారాని కి చేరుకుంది. నిన్న జరిగిన ఎపిసోడ్ తో బిగ్ బాస్ 30 రోజులు పూర్తి చేసుకుంది.ఎప్పటిలానే బిగ్ బాస్ లో నిన్న ఎన్నడూ లేని విధంగా ఎవరూ ఊహించని విధంగా నామినేషన్ల ప్రక్రియ చాలా ఆసక్తికరంగా జరిగింది. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 15 మంది ఉన్నారు. ఇక మొదటి వారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి ఎలిమినేట్ అవ్వగా, నాలుగో వారానికి గాను నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.

ఎట్టకేలకు బిగ్ బాస్ గేరు మార్చాడు. బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ఒకే పంథా లో ఓపెన్ నామినేషన్స్ కి మొగ్గు చూపిన బిగ్ బాస్….. ఇప్పుడు గేరు మార్చి కన్ఫెషన్ రూమ్ లో నామినేషన్ల ప్రక్రియని ఏర్పాటు చేసాడు. నెమ్మది నెమ్మదిగా నామినేషన్స్ లో ఉన్న సభ్యుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ పోతుంది. నాలుగో వారం బాగ్ బాస్ హౌస్ 8 మంది నామినేట్ అవ్వగా తాజాగా నిన్న జరిగిన ఐదో వారం నామినేషన్ల ప్రక్రియలో మొత్తానికి 9 మంది (షన్ను, రవి, సన్నీ, ప్రియా, మానస్, జెస్సి, హమీదా , విశ్వ , లోబో)….. ఇంటి నుండి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారు.
షణ్ముఖ్ కే దక్కిన ఘనత :
ఇదిలా ఉండగా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ కి అటు యూట్యూబ్ లో కాకుండా ఇటు బిగ్ బాస్ లో కూడా రికార్డుల మోత మోగిస్తున్నాడు. నిన్న జరిగిన నామినేషన్ ప్రక్రియలో మునుపెన్నడు లేనివిధంగా షణ్ముఖ్‌ను ఏకంగా ఎనిమిది మంది నామినేట్ చేశారు. సన్నీ, విశ్వ, లోబో, రవి, హమీదా, ప్రియ, మానస్, శ్రీరామ్ ఇలా అందరు షణ్ముఖ్‌ను నామినేట్ చేయడంతో షణ్ముఖ్ కాస్త ఫీల్ అయ్యాడు..