Bigg Boss OTT Telugu Elimination: బిగ్ బాస్.. ఈ షోకు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం నాన్ స్టాప్ అంటూ ఓటీటీలో టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ కూడా అయింది. ఇక ఈ వారం సీన్ క్లైమాక్స్‌కు చేరింది. ఫస్ట్ రెండు వారల్లో ఎవరూ ఊహించనట్టుగా గ్లామరస్ బ్యూటీస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయంపై ఇంక్లా క్లారిటీ రాలేదు. తాజా పరిణామాలను గమనిస్తే ఓటింగ్స్ లోనూ తేడాలు కనిపించాయి.

గొడవలు, అభిప్రాయ బేధాలు బిగ్ బాస్ షోలో రోజురోజుకు సీన్ లను మారుస్తున్నాయి. హౌస్ మెంబర్స్ ఎవరూ టాస్కుల విషయంలో తగ్గేదేలే అంటున్నారు. సీనియర్ కంటెస్టెంట్స్‌ను వారియర్స్‌గా సెట్ చేశాడు బిగ్ బాస్. కొత్త వారిని ఛాలెంజర్స్‌గా మార్చాడు. ఇక ఈ రెండు గ్రూపుల మధ్య చాలా టాస్కులు కొనసాగుతున్నా్యి. ఈ రెండు గ్రూపుల్లోని కంటస్టెంట్స్ మధ్య అభిప్రాయ బేధాలు రావడం, గొడవలు జరగడం వంటివి కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read: కేసీఆర్ ను ఫాలో అవుతున్న జగన్.. ఏపీలొ కొలువుల జాతర.. సేమ్ స్ట్రాటజీ
అసభ్యకరమైన సీన్స్, సరసాలు, పొరపాట్ల వలన.. ఫస్ట్ వీక్‌లో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది. తర్వాత శ్రీ రాపాక ఎలిమినేట్ కావడంతో ఓ వర్గం ఆశ్చర్యపోయిందిది. వాస్తవానికి వీరిద్దరూ సుమారు 4 నుంచి ఐదు వారాలు ఉంటారని భావించారు. కానీ వారు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల ఎలిమినేట్ కాక తప్పలేదు.

ఇక ఈ వారం ఏకంగా 12 మందిని నామినేషన్ లిస్ట్ లో చేర్చడం హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్ హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 12 మందిని డేంజర్ జోన్ లోకి వెళ్లారు. ఇక ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్నవారిలో ఎలిమినేట్ కాబోయేది ఎవరనేది సస్పెన్స్. బిందుమాధవి టాప్ లిస్టులో ఉన్నట్టు టాక్. తర్వాత అఖిల్ సార్ధక్ ఉన్నాడు. వీరు ప్రతి విషయంలో గొడవ పడుతున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు వెళ్లిపోతారనేది సస్పెన్స్.
Also Read: ‘నమ్మకం’ మెసేజ్ లు: జీవితంలో ఎలాంటి మనుషులను నమ్మాలి..?