Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. గత సీజన్ లో కంటే భిన్నమైన టాస్క్ లతో నిత్యం అలరిస్తోంది. ఎప్పుడు ఎలాంటి టాస్క్ లతో కంటెస్టెంట్స్ మధ్యలో బిగ్ బాస్ గొడవ పెడతాడో ఊహించడం చాలా కష్టం. ఈ నాన్ స్టాప్ షోలో బిగ్ బాస్ చిత్రవిచిత్రమైన టాస్క్ లను ఇస్తున్నాడు. ఉన్న కంటెస్టెంట్స్ తో కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను ఇస్తున్నాడు.

ఇప్పటికే 17 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. గడిచిన ఐదు వారాల్లో ఆర్జే చైతు, శ్రీ రాపాక, తేజస్వి, సరయులు ఎలిమినేట్ అయిపోయారు. ముమైత్ ఖాన్ మొదటి వారమే ఎలిమినేట్ అయినా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సారి మాత్రం చాలా బోల్డ్ కంటెంట్ ఎక్కువగా పండుతోంది. హౌస్ లో బోల్డ్ బ్యూటీలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయితే తాజా ఎపిసోడ్ లో మరీ దారుణమైన బోల్డు కంటెంట్ వచ్చింది.
Also Read: 4 Day Work Week: నాలుగు రోజుల పనికే ఉద్యోగుల మొగ్గు..?
అషురెడ్డిని యాంకర్ శివ దారుణంగా నలిపేసాడు. అసభ్యకరంగా ఆమెతో ప్రవర్తించి ప్రైవేట్ పార్ట్ పై చేయి వేశాడు. తాజా ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఫ్యామిలీ టాస్క్ ను ఇచ్చాడు. ఇందులో నటరాజ్ మాస్టర్ ఇంటి పెద్దగా మారి తన కుటుంబ సభ్యులను ఎంచుకోవాలి. ఎవరిని ఎందుకోసం ఎంచుకుంటున్నాడో చెప్పి ఫన్నీ గా టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా నటరాజ్ తన భార్యగా ముమైత్ ఖాన్ ను, పెద్ద కొడుకుగా అఖిల్ ను, గయ్యాలి కోడలిగా బిందుమాధవిని తీసుకున్నాడు. అలాగే చిన్న కొడుకుగా అజయ్ ను, చిన్న కూతురుగా హమీదాను తీసుకున్నాడు.

ఇక బేవర్స్ కొడుకుగా యాంకర్ శివను, అతనికి భార్యగా అషు రెడ్డిని ఎంచుకున్నాడు. అయితే దొరికిందే సందు అన్నట్టు యాంకర్ శివ రెచ్చిపోయాడు. బాద్ షా సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ను ఇమిటేట్ చేశాడు. టాస్క్ జరిగినంత సేపు అషురెడ్డి మీద పడి పోతూ ఆమెను ఘోరంగా నలిపేసాడు. ఆమె నడుమును హగ్ చేసుకోవడం, ఆమె మీద పడి పోతూ అసభ్యంగా పడుకోవడం లాంటివి చేశాడు. ఇందుకు అషు రెడ్డి కూడా బాగానే సహకరించింది. ఇక చివరగా ఆమె మీద పడుకొని తన బ్యాక్ మీద చెయ్యి వేసాడు.
టాస్క్ అయిపోయినప్పటికీ ఆమె మీద అలాగే పడుకొని ఉండిపోయాడు. దీంతో అందరూ షాక్ అయిపోయారు. అషురెడ్డి గట్టిగా అరిచేసి రూమ్ లోకి వెళ్ళిపోయింది.
Also Read:Current cuts: కరెంట్ కోతలైనా.. మరేదైనా.. వైసీపీది ఒకటే దారి..!