https://oktelugu.com/

Bigg Boss OTT: బిగ్ బాస్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్… కంటెస్టెంట్స్ ఎంపికయ్యాక రద్దు, కారణం అదేనా?

సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క అలియాస్ శిరీష, సింగర్ పార్వతి, యష్ మాస్టర్, హీరోయిన్ రిచా పనయ్, నటుడు భద్రం... ఇలా కొందరి సెలెబ్రెటీలను కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : January 30, 2024 / 05:29 PM IST
    Follow us on

    Bigg Boss OTT: బిగ్ బాస్ సీజన్ 7 సూపర్ డూపర్ హిట్ అనడంలో సందేహం లేదు. అత్యధిక టిఆర్పి సొంతం చేసుకుని బుల్లితెర చరిత్రలో నెంబర్ వన్ షో గా నిలిచింది. ఫినాలే రోజు రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది. కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కావడం సంచలనంగా నిలిచింది. సీజన్ 7 ని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇదే జోష్ లో మేకర్స్ బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 2 ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఓటిటీ సీజన్ 2 కోసం కొందరు సెలబ్రెటీలను కూడా ఫిక్స్ చేశారు. మాజీ కంటెస్టెంట్స్ భోలే షావలి, నయని పావని పేర్లు ప్రధానంగా వినిపించాయి.

    అంతే కాకుండా సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క అలియాస్ శిరీష, సింగర్ పార్వతి, యష్ మాస్టర్, హీరోయిన్ రిచా పనయ్, నటుడు భద్రం… ఇలా కొందరి సెలెబ్రెటీలను కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా బిగ్ బాస్ ఓటిటీ క్యాన్సిల్ అయింది. దీంతో బిగ్ బాస్ ప్రియులకు నిరాశ ఎదురైంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే … ఓటిటీ వెర్షన్ కావడంతో ఎవరు అంతగా ఆసక్తి చూపలేదట. పైగా ఎక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా కూడా కంటెస్టెంట్స్ గా రావడానికి సెలెబ్స్ అంగీకరించలేదట.

    మరో ముఖ్య కారణం హీరో నాగార్జున ఈ సీజన్ హోస్ట్ చేయడం లేదని తెలిసింది. బిగ్ బాస్ ఓటిటీ 1 కి సరైన ఆదరణ లభించలేదు. అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కి కూడా గుర్తింపు రాలేదు. ఈ కారణాల నేపథ్యంలో మేకర్స్ ఓటిటీ సీజన్ ను రద్దు చేశారు అని తెలుస్తుంది. దీంతో బిగ్ బాస్ ప్రేమికులకు షాక్ తగిలినట్లయింది. ఈ న్యూస్ విని నిరుత్సాహ పడుతున్నారు బిగ్ బాస్ ప్రియులు.

    ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ వన్ విషయానికొస్తే… హీరోయిన్ బిందు మాధవి, సీజన్ 4 రన్నర్ అఖిల్ సార్ధక్, అరియనా, నటరాజ్ మాస్టర్, యాంకర్ శివ వంటి సెలెబ్స్ పాల్గొన్న సంగతి తెలిసిందే. కాగా భిందు మాధవి టైటిల్ విన్నర్ అయింది. అఖిల్ రన్నర్ గా నిలిచాడు.