Bigg Boss Non Stop Telugu: బిగ్ బాస్ నాన్ స్టాప్ ఆసక్తికరంగా సాగుతోంది. మొత్తం 17 మంది కంటెస్టెంట్లతో మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్.. ప్రస్తుతం 16 మంది కంటెస్టెంట్లకు చేరింది. గత వారం ఎలిమినేషన్ రౌండ్ లో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యింది. నిజానికి గత వారం మిత్ర ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించినా ఆమె సేవ్ అయింది. మిత్ర స్థానంలో అనూహ్యంగా ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయింది.

రెండో వారంలో సరయు, అఖిల్, హమీద, అనిల్, మిత్ర, అరియానా, శివ, నటరాజ్ మాస్టర్, అషురెడ్డి, శ్రీరాపాక, మహేష్ విట్టాలు హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయ్యారు. గత వారం ఎలిమినేషన్ నుండి తప్పించుకున్న మిత్ర మరోసారి ఎలిమినేషన్ లో ఉండటంతో అందరూ ఆమె వంచే చూస్తున్నారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ఈ వారం వారియర్ టీం సభ్యులు ఛాలెంజర్స్ టీం సభ్యులను ఎలిమినేషన్ కు నామినేట్ చేయగా.. ఛాలెంజర్స్ టీం సభ్యులు వారియర్ టీం సభ్యులను నామినేట్ చేవారు.
ఇక నామినేట్ చేసేందుకుగాను కంటెస్టెంట్ల ఫోటోలతో కూడిన బాక్సులలో నచ్చని వాళ్ల ఫోటోల మీద డ్రాగన్ తో గుచ్చాలి. అనంతరం వారిని ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నారో బిగ్ బాస్ కు కంటెస్టెంట్లు వివరించాలి. అలా ఈ వారం బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్లు అఖిల్, అరియానా, హమీద, నటరాజ్ మాస్టర్, మహేష్ విట్టాలతో పాటు సరయు, అనిల్, మిత్ర, శివ, అషురెడ్డి, శ్రీరాపాకలు ఎమినేషన్ కు నామినేట్ అయ్యారు.

అయితే OTTలో 24గంటల లైవ్ పేరుతో మొదలైన బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభంలో కాస్త ఉసూరుమనిపించినా.. ఇప్పుడు మాత్రం కాస్త ట్రాక్ ఎక్కినట్లే కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌజ్ లోని కంటెస్టెంట్లలో కొందరు స్ట్రాటజీని ఇప్పుడే మొదలు పెట్టినట్లు అర్థమవుతోంది. కానీ మరికొందరు మాత్రం సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు బిగ్ బాస్ నాన్ స్టాప్ చూస్తున్న ఎవరికైనా అర్థమవుతుంది.
[…] […]