Bigg Boss Non Stop Anchor Shiva: ఏదోరకంగా పేరు ప్రఖ్యాతలు ఉంటేనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం వస్తుంది. ఒకటి సెలబ్రెటీ అయినా ఉండాలి.. లేదా యూట్యూబ్ స్టార్ అయినా కావాలి.. కానీ చిన్న చిన్న ఇంటర్వ్యూలు చేసి కాంట్రవర్సీ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ శివ ఎలాంటి అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడు. ఓటీటీ వేదికగా సాగుతున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ లో యాంకర్ శివ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. టైటిల్ రేసులో లేకపోయినా ఆయన ఈ పొజిషన్ కు రావడంపై సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతోంది. టాస్క్స్, గేమ్స్ తో హైలెట్ అయి స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న యాంకర్ శివకూ ఇప్పుడు బిగ్ బాస్ నాన్ స్టాప్ తో విపరీతమైన అభిమానులు ఉన్నారు.
బిగ్ బాస్ నాన్ స్టాప్ లో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఇప్పటికే హౌస్ లోకి వచ్చినవారున్నారు. మరికొందరు అప్పటికే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నవారున్నారు. కానీ యాంకర్ శివ మాత్రం కొందరికే పరిచయం. టిక్ టాక్ ద్వారా ఫాలోవర్స్ పెంచుకున్న ఆయన యూట్యూబ్లో చేసే కొన్ని ఇంటర్వ్యూలు కాంట్రవర్సీగా మారాయి. దీంతో ఆయనకు కాంట్రవర్సి శివగా పేరు వచ్చింది. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా తన జీవితం ఇంతే అనుకున్న సమయంలో అనుకోకుండా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని శివ క్యాష్ చేసుకున్నాడు. టాప్ ప్లేసులోకి వెళ్లాడు.
Also Read: Sarkaru Vaari Paata: ‘సర్కారు’ కలెక్షన్స్.. గొప్పలు & తిప్పలతో పాటు పూర్తి లెక్కలివే !
హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత శివ ముందుగా బిందుమాధవితో ఫ్రెండ్ షిప్ చేశాడు.అదే అతడికి ప్లస్ అయ్యింది. టాప్ 5లోకి తీసుకొచ్చింది. ఆ తరువాత రెట్టించిన ఉత్సాహంతో తనకు అప్పగించిన టాస్క్ లను పూర్తిచేశాడు. అఖిల్, అజయ్, అనిల్, నటరాజ్ మాస్టర్ లాంటి వారితో పోటీ పడి మరీ ముందుకెళ్లాడు. అయితే ఒక్కోసారి టంగ్ స్లిప్ కూడా అయ్యాడు. అషూరెడ్డి, అరియానా, హమీదా, సరయు లాంటి వాళ్లతో కాస్త దురుసుగా ప్రవర్తించి.. ఆ తరువాత సారీ చెప్పాడు. అలా సారీ చెప్పడం వల్ల ఎదుటివారి మనసులు గెలుచుకున్నాడు. అయితే అషురెడ్డికి శివపై కోపం వచ్చి తనతో మాట్లాడడం మానేసింది. బిందుమాధవి సైతం శివను నామినేట్ చేసింది. ఫ్రెండ్ గా ఉంటూనే తప్పులు ఎత్తిచూపి తనను నామినేట్ చేసింది.
ఇలా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు శివ చేసిన టాస్క్ లన్నీ ఒక్కసారిగా ఆయన ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. శివ కూడా తన జర్నీని చూసి ఎమోషనల్ అయ్యారు. సరయు తో మాట్లాడిన మాటలకి నటరాజ్ మాస్టర్ స్టాండ్ తీస్కోవడం, స్టిక్కర్స్, లైక్స్ టాస్క్ లో నటరాజ్ మాస్టర్ తో జరిగిన గొడవ అరియానాతో చేసిన ఫ్రెండ్ షిప్ ఇవన్నీ గుర్తు చేసుకొని శివ కన్నీటి చుక్కలు తెచ్చుకున్నాడు. అటు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకు కూడా శివ అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని నాగ్ ప్రత్యేకంగా చెప్పడంతో మరింత ఉత్సాహంతో గేమ్స్ ను పూర్తి చేయగలిగాడు. దీంతో శివ హైలెట్ అయ్యాడు. యాంకర్ శివ టైటిల్ పోరులో లేకపోయినా టాప్ 3 లో ఉండడం నిజంగా గొప్ప విషయమే అని అంటున్నారు.
ఓ వైపు ఎలిమినేషన్ టైమ్ వస్తున్నా.. వాటిని అధిగమించి ముందుకెల్లాడు శివ. హౌస్ మేట్స్ కు గట్టి పోటీనిచ్చి సేఫ్ గా మారాడు. హౌస్ లో ఎలాంటి గొడవలు జరిగినా, నామినేషన్స్ సమయంలో తిట్టుకున్నా.. టాస్క్ లో పోటీ పడినా.. ఆ తరువాత అందరితో సరదాగా ఉండడం శివ గొప్పదనం అని కీర్తిస్తున్నారు. ఈ కారణంగానే సోషల్ మీడియాలో శివ కు అభిమానులు పెరిగారు. అతడికి ఓటింగ్ వేయాలని చాలా మంది కోరుతున్నారు.
Also Read:Child Marriages In AP: బాల్య వివాహాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్.. తెలంగాణ స్థానం ఏంటో తెలుసా?